తమిళనాట విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న కథానాయకుడు విజయ్ సేతుపతి. గత ఏడాది సంచలన విజయం సాధించిన `96`తో నటుడిగా మరో మెట్టుకి ఎదిగాడు విజయ్. ఇదిలా ఉంటే… ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు… మరో తెలుగు చిత్రంలోనూ నటించేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా నటించేందుకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
వైష్ణవ్ సినిమాలో విజయ్ నటించడం ఖాయమైతే… మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో తనకు ఇది మూడో చిత్రమవుతుంది. ఇప్పటికే `ఒరు నల్ల నాళ్ పాతు సొల్రేన్` అనే తమిళ చిత్రంలో మెగా డాటర్ నిహారికతో కలసి నటించిన విజయ్… ఇప్పుడు `సైరా`లో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ వరుసలోనే… వైష్ణవ్ తేజ్ కూడా చేరుతుండడం విశేషం. త్వరలోనే విజయ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=qzw6iLHHRtM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: