రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా భారత్ మూవీ రూపొందుతుంది. జూన్ 5వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. కత్రినా కైఫ్, టబు, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, హీరో వరుణ్ ధావన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. భారత్ మూవీ ని హిందీ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారత్ మూవీ లో హారో సల్మాన్ ఖాన్ 20సంవత్సరాల యువకుడి నుండి 70 సంవత్సరాల వృద్ధుడి వరకు పలు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీ లో భారత్ మూవీ ఆఖరు షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ముంబై లో ఢిల్లీ తలపించేలా భారీ సెట్ ను రూపొందించారు. అలీ అబ్బాస్ జాఫర్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో భారత్ మూడవ సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సుల్తాన్ మూవీ 600 క్రోర్స్, టైగర్ జిందా హై మూవీ 565 క్రోర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి. 3దశాబ్దాలుగా స్టార్ హీరో గా వెలుగొందుతున్న సల్మాన్ ఖాన్ నటించిన పలు చిత్రాలు 100కోట్ల క్లబ్ లో చేరాయి.
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: