ఎవరితో పనిలేకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి వర్మనే కావాల్సినంత పబ్లిసిటీ చేసేస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా… లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన దగ్గర నుండి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఈ ఒక్క పాయింట్ వల్లే సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది. వర్మ తీయబోయే సినిమా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్న వాళ్లు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి తోడు వర్మ కూడా ఎప్పటికప్పుడు పలు ట్వీట్లు, ఫొటోలతో ఇంట్రెస్ట్ పెంచేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాను గతంలో చెప్పినట్టే మహానాయకుడు రిలీజ్ డేట్ ను ప్రకటించిన వెంటనే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు చెప్పాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ విషయాన్నితనదైన శైలిలో ప్రకటించాడు వర్మ.
‘ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. ఉదయం 9:27 గంటలకల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. మొత్తానికి వర్మ ఇప్పుడే ఇన్ని ట్విస్ట్ లు ఇస్తుంటే..ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తాడో చూద్దాం..
ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు. #LakshmisNTR pic.twitter.com/9jcbAOgeme
— Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2019
[youtube_video videoid=PZeqgoH1OzQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: