సెన్సేషనల్ హిట్ `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు… తొలి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయినా… సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది పాయల్. ప్రస్తుతం… మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కోరాజా`లో నటిస్తున్న పాయల్… ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలోనూ నాయికగా నటిస్తోంది. అలాగే… కింగ్ నాగార్జున నటించనున్న `మన్మథుడు` సీక్వెల్‌లోనూ పాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… మరో ఆసక్తికరమైన చిత్రంలో నటించేందుకు పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. పరందీప్ అనే నూతన దర్శకుడు… ఇటీవలే పాయల్‌ను సంప్రదించి ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను చెప్పాడని… కథ నచ్చడంతో పాయల్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని టాక్. అంతేకాదు… ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ టాలెంటెడ్ బ్యూటీ కనిపించనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఛాలెంజింగ్ రోల్స్‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న పాయల్… మున్ముందు ఇంకెన్ని వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.
[youtube_video videoid=ecFWQHkti_Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: