ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈసినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాని ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయని… త్వరలోనే ఈ సినిమాను ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: