యన్టీఆర్ ‘రేచుక్క పగటిచుక్క’కు 60 ఏళ్ళు

60 Years For Sr NTR Rechukka Pagati Chukka Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sr NTR Rechukka Pagati Chukka Movie Latest Updates,Sr NTR Rechukka Pagati Chukka Movie Completes 60 Years,Rechukka Pagati Chukka Movie Turns 60 Years,60 Years of Rechukka Pagati Chukka Movie
60 Years For Sr NTR Rechukka Pagati Chukka Movie

మహానటుడు యన్.టి.రామారావు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుది విజయవంతమైన జోడి. ‘చంద్రహారం’(1954)తో మొదలైన వీరి ప్రయాణం… ‘శ్రీకృష్ణ విజయం’(1971) వరకు సాగింది. అలా.. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘రేచుక్క పగటిచుక్క’ ఒకటి. యన్.టి.రామారావు, య‌స్.వి.రంగారావు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో… యన్టీఆర్ సరసన ‘షావుకారు’ జానకి కథానాయికగా నటించారు. య‌స్.వరలక్ష్మి అతిథి పాత్రలో దర్శనమివ్వ‌గా…

కన్నాంబ, సి.ఎస్.ఆర్, ఆర్.నాగేశ్వరరావు, ‘చిత్తూరు’ నాగయ్య, రాజనాల తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సముద్రాల జూనియర్ రచించిన గీతాలకు… యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పన చేసారు. వాటిలో “మనవి సేయని”, “కాదా అవునా” పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. యన్.త్రివిక్రమరావు అందించిన కథకు సముద్రాల జూనియర్ మాటలు బాగా ప్లస్ అయ్యాయి. 1959 మే 14న విడుదలై అనూహ్య విజయం సాధించిన ‘రేచుక్క పగటిచుక్క’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here