త‌మ‌న్ ఖాతాలో మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌

Thaman To Score Tunes For Sai Dharam Tej and Maruthi Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sai Dharam Tej and Maruthi New Movie Music Director,Music Director Thaman Next Film Updates,Thaman To Feature With Sai Dharam Tej and Maruthi Movie,Sai Dharam Tej Next Project Details
Thaman To Score Tunes For Sai Dharam Tej and Maruthi Movie?

గత ఏడాది ‘భాగమతి’, ‘తొలిప్రేమ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలకు సంగీతం అందించిన తమన్… ఈ ఏడాది ‘మజిలీ’ వంటి ఫ్యామిలీ ఎమెష‌న‌ల్ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించి మ‌రో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో… తాజాగా మ‌రో ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ మూవీకి సంగీత ద‌ర్శ‌కుడిగా పని చేసే అవ‌కాశం త‌మ‌న్‌ని వ‌రించింద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్‌ స్పెషలిస్ట్ మారుతి కలయికలో ‘ప్రతి రోజూ పండగే’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్కబోతున్న విష‌యం తెలిసిందే. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న‌ ఈ సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసాడట మారుతి. ఇదివ‌ర‌కు మారుతి, తమన్ కాంబినేష‌న్‌లో ‘మహానుభావుడు’ (2017) వంటి విజయవంతమైన చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే… సాయితేజ్ హీరోగా రూపొందిన తిక్క‌, విన్న‌ర్‌, జ‌వాన్‌, ఇంటిలిజింట్‌ చిత్రాల‌కు త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

ఇదిలా ఉంటే… వ‌చ్చే వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం… తాత, తండ్రి, మ‌న‌వ‌డు ఇలా మూడు తరాల మధ్య సాగే క‌థ‌తో సాగుతుంద‌ని స‌మాచారం. కొడుకు పాత్రలో సాయితేజ్ కనిపించనుండగా… తండ్రి పాత్రలో విలక్షణ నటుడు రావు ర‌మేష్ దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే కథానాయికతో పాటు మిగిలిన సాంకేతిక వర్గం వివ‌రాల‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

[subscribe]
[youtube_video videoid=7WGdYZgzJiM ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =