
ట్యాగ్ · 28 కథనాలు


'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్

"వకీల్ సాబ్ " పై మహేష్ బాబు ప్రశంసలు

వకీల్ సాబ్ తెలుగు మూవీ పబ్లిక్ టాక్

'పవన్' వకీల్ సాబ్ కాకపోతే 'నాగ్'

'వకీల్ సాబ్' ట్రైలర్ రిలీజ్

పవన్ కు థమన్ 5స్టార్స్
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
ఆదివాసీలతో 'అజ్ఞాతవాసి' ముచ్చట
"వకీల్ సాబ్" మూవీ రికార్డ్
లిక్విడ్ డైట్ లో పవన్ కళ్యాణ్

సెట్స్ లో నేను, పవన్ పట్టించుకోము

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?
పవన్ 'వకీల్ సాబ్' షూటింగ్ అప్ డేట్..!
వసూల్ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న 'వకీల్ సాబ్'?
మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా "వకీల్ సాబ్"

2021 లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇండియా నెం 1 మూవీ "వకీల్ సాబ్ "
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

'వకీల్ సాబ్'- 9 పేజీల డైలాగ్..సింగిల్ టేక్
మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ తో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతేకాదు ఈసినిమాలో ముఖ్యంగా కోర్టు సీన్స్ కు మాత్రం మంచి అప్లాజ్ వచ్చింది. ప్రకాష్ రాజ్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ కానీ.. అలాగే వాదోపవాాదాలు కానీ ఇద్దరూ పోటీ పడిమరీ నటించారు అన్నారు.

"వకీల్ సాబ్ " పై మహేష్ బాబు ప్రశంసలు
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో, రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ టైమ్ లాయర్ గా నటించిన పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రకాష్ రాజ్ , అంజలి , నివేద , అనన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వకీల్ సాబ్ తెలుగు మూవీ పబ్లిక్ టాక్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

వకీల్ సాబ్ తెలుగు మూవీ రివ్యూ - పవన్ ఈజ్ బ్యాక్
ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునే సినిమా. మూడేళ్లు ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరికీ ఈసినిమా నచ్చుతుంది.

'పవన్' వకీల్ సాబ్ కాకపోతే 'నాగ్'
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా వకీల్ సాబ్ లో పవన్ కాబట్టే ఆసినిమాకు అంత హైప్ వచ్చింది. మరి ఒకవేళ వకీల్ సాబ్ పాత్రలో పవన్ కాకుండా వేరే హీరో అయితే.. ఇన్ని రోజులు వకీల్ సాబ్ గా పవన్ ను ఫిక్స్ అయ్యాం కాబట్టి మరొక హీరోను ఊహించుకోవడం కష్టమే.

'వకీల్ సాబ్' ట్రైలర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన కోసం అభిమానులు మూడేళ్లుగా చూస్తున్నారు. అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ కోసం చూస్తున్నారుఅప్పుడెప్పుడో 2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి చేసిన తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయాడు పవర్ స్టార్. ఆ తర్వాత ఈయన సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ళకు వకీల్ సాబ్ సినిమాతో వస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్ హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు.. పవన్ స్టామినాకు తగ్గట్టు కథలో చిన్న మార్పులు చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్…
'వకీల్ సాబ్' సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్
మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

పవన్ కు థమన్ 5స్టార్స్
దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొనివేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
కరోనా వల్ల పెండింగ్ లో పడిపోయిన చాలా సినిమాలు షూటింగ్ లను మొదలు పెట్టి రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని పొంగల్ కు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వకీల్ సాబ్ కూడా రిలీజ్ కు సిద్ధపడుతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.
ఆదివాసీలతో 'అజ్ఞాతవాసి' ముచ్చట
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది. ఇక పవన్ కూడా ఇటీవలే షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం షూటింగ్ కోసం అరకు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
"వకీల్ సాబ్" మూవీ రికార్డ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ , నరేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
లిక్విడ్ డైట్ లో పవన్ కళ్యాణ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సెట్స్ లో నేను, పవన్ పట్టించుకోము
పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిలికి చిలికి వాన అయినట్టు ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఇంకాస్త ముదిరింది. అయితే ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ విషయంపై మాట్లాడిన ప్రకాష్ రాజ్ సెట్స్ లో అలాంటివి పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు. నటులుగా మేము కలిసి పని చేసాం.. అంతేకాదు ఒకరి మీద ఒకరి గౌరవం ఉంది అని తెలిపాడు. అయినా పవన్ కు నేను తన ఐడియాలజీని విమర్శించానని.. పర్సనల్ గా తనని విమర్శించలేదని తెలుసు అని అన్నారు…

20 ఏళ్ల కిందటే పవన్ తో పనిచేశా - వేణు శ్రీరామ్
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ ను తిరిగి డిసెంబర్ లో ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ తో 20 ఏళ్ల కిందటే పని చేసినట్టు చెబుతున్నాడు వేణు శ్రీరామ్.

పవన్ కళ్యాణ్ బర్త్ డే కు "వకీల్ సాబ్ "టీజర్ రిలీజ్ ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ " తెలుగు రీమేక్ "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేత థామస్ , అనన్య నాగళ్ళ , అనసూయ , ప్రకాష్ రాజ్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
పవన్ 'వకీల్ సాబ్' షూటింగ్ అప్ డేట్..!
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ సినిమా ఈపాటికి థియేటర్ లో రిలీజ్ అయి రెండు వారలు అయిపోయివుండేది. తన అభిమాన హీరోని ఎప్పుడు వెండితెరపై మళ్ళీ చూసుకుందామా అన్న అభిమానుల కోరిక కూడా తీరేది. కానీ కరోనా దెబ్బకి సీన్ మొత్తం రివర్స్ అయింది. షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇక అన్ని సినిమాల్లాగానే వకీల్ సాబ్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడింది.
వచ్చే సంక్రాంతి లేదా రిపబ్లిక్ డేకి 'వకీల్ సాబ్'!
పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగానే షూటింగ్ ను జరుపుకుంది. అయితే కరోనా వల్ల శరవేగంగా జరుపుకుంటున్న షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ... అది కూడా వాయిదా పడనుంది. లాక్ డౌన్ కనుక తీస్తే మిగిలిన షూటింగ్ ను కూడా తొందరలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఒకవేళ ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా రిలీజ్ మాత్రం అప్పుడే లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ మాత్రం ఇప్పుడప్పుడే ఓపెన్…
వసూల్ సీజన్‌ను టార్గెట్ చేసుకున్న 'వకీల్ సాబ్'?
తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సంక్రాంతి సీజన్‌ని వసూల్ సీజన్‌గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో విడుదలైన పలు చిత్రాలు భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ముగ్గుల పండక్కి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సంక్రాంతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేయనుందని తెలుస్తోంది. ఆ చిత్రమే.. ‘వకీల్ సాబ్’.
మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా "వకీల్ సాబ్"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.