కరోనా వల్ల పెండింగ్ లో పడిపోయిన చాలా సినిమాలు షూటింగ్ లను మొదలు పెట్టి రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని పొంగల్ కు రావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు వకీల్ సాబ్ కూడా రిలీజ్ కు సిద్ధపడుతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Powerstar @Pawankalyan wraps up his shoot for #VakeelSaab. The POWER will unleash very soon 🔥🔥🔥#SriramVenu @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @BayViewProjOffl @BoneyKapoor @MusicThaman pic.twitter.com/LlIjKJsz0U
— Telugu FilmNagar (@telugufilmnagar) December 29, 2020
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
నిజానికి ఈ ఏడాది పవన్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్న అభిమానులకు కరోనా వల్ల ఒక రకంగా నిరాశ ఎదురైనట్టే. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా వచ్చే సమ్మర్ కు వెళ్ళింది. సంక్రాంతికి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.. అలాగే సినిమాను ఏప్రిల్ లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి ఎం జరుగుతుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























