
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 217


ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్

సరికొత్త చరిత్ర సృష్టించిన హనుమాన్


హనుమాన్ 20డేస్ కలెక్షన్స్

అంబాజీపేట పెయిడ్ ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసలు

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

NBK109.. కన్ఫామ్ ఫీమేల్ లీడ్ గా ఊర్వశి రౌతేలా

ఆకట్టుకుంటున్న సూర్య ట్రెండీ లుక్

బ్రేకింగ్.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్
సినీ రంగానికి, రాజకీయ రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. అయితే వారి తరువాత అందరూ ఆసక్తిగా ఎదురుచూసింది తలైవా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తన అరోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

కెప్టెన్ మిల్లర్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.పొంగల్ కు విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తో 50కోట్ల వరకు రాబట్టుకుంది.ఇక అదే రోజు ఈసినిమా తెలుగులోకూడా విడుదలకావాలి కానీ పోటీ ఎందుకని వెనక్కి తగ్గి గత వారం విడుదలైంది.ఇక ఇప్పుడు ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈనెల 9న తెలుగు తోపాటు తమిళ ,కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రైమ్ ప్రకటించింది.

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్
రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

సరికొత్త చరిత్ర సృష్టించిన హనుమాన్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.270 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు.

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు రివ్యూ..ఎమోషనల్ విలేజ్ డ్రామా
ఓవరాల్ గా చెప్పాలంటే మంచి ఎమోషనల్ మూవీని చూడాలనుకుంటే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా మంచి ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చెయొచ్చు..

రివ్యూ.. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే గేమ్ ఆన్
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చెయొచ్చు.

బబుల్ గమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 31 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కింది.

విశ్వంభర సెట్స్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, షూటింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో దీనిపై ఇటు మెగాభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన 'విశ్వంభర' టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారం నుండి కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకునే దిశలో ఉంది.

రవితేజ గారి సినిమాకి మ్యూజిక్ చేయడం నా అదృష్టం.. మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్డ్
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈగల్ సంగీత దర్శకుడు డేవ్ జాన్డ్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

నేపాలీ సినిమా ‘హ్రశ్వ దీర్ఘ’.. బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంత చేసుకున్న ఆయన తాజాగా మరో ఘనత సాధించారు.

హనుమాన్ 20డేస్ కలెక్షన్స్
హనుమాన్ 20వ రోజు కూడా జోరు కొనసాగించింది.తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది దాంతో వరుసగా 20వరోజు కూడా కోటి రూపాయలు రాబట్టి బాహుబలి సరసన నిలిచింది.ఈజాబితాలో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది అయితే ఈ స్థానాన్ని అందుకోవడం హనుమాన్ కు అసాధ్యమనే చెప్పాలి.ఇక హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా 20రోజుల్లో 270కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టుకుంది.ఈవారం అన్ని చిన్న సినిమాలే వుండడంతో హనుమాన్ ఈవీకెండ్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో శేఖర్ కమ్ముల మూడో సినిమా
టాలీవుడ్ లో ఉన్న సెన్సిటివ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుతం తను ధనుష్-నాగార్జున హీరోలుగా వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అంబాజీపేట పెయిడ్ ప్రీమియర్లకు సూపర్ రెస్పాన్స్
రేపు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9సినిమాలు విడుదలవుతున్నాయి అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కానీ ఒక్క సినిమా మాత్రం మంచి బజ్ ను క్రియేట్ చేసింది అదే కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయించడం తోమంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా మీద వున్న నమ్మకంతో ఈరోజు కొన్ని థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు.ఈ షోలకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.దాదాపు అన్ని షోస్ సోల్డ్ అవుట్ అయ్యాయి.

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసలు
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి. ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో.. సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటుంది. ఇక ఇన్ట్సాలో కూడా ఉపాసన యాక్టింగ్ గానే ఉంటుంది. తన ఇన్ట్సా ద్వారా పలు ఆసక్తికర వియాలను పంచుకుంటుంది. ఇప్పుడు తాజాగా మరో వార్తను పంచుకున్నారు ఉపాసన. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ను కలిసినట్టు తెలిపింది. ఈనేపథ్యంలోనే ఆమె ట్రైబల్ వెల్ ఫేర్ కోసం చేస్తున్న పనులు నా మనసును హత్తుకున్నాయి.. మీరు చేస్తున్న పనికి ధన్యవాదములు మేడం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది.

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్పటికే 'యాత్ర 2' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

విశ్వంభర షూటింగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా వస్తుంది విశ్వంభర.బింబిసార ఫేమ్ వేణు మల్లిడి డైరెక్ట్ చేస్తున్నాడు.తన మొదటి సినిమాలాగే ఇది కూడా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ.రీసెంట్ గా ఈసినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సూపర్ అనిపించుకుంది దాంతో ఇంకా షూటింగ్ కూడా సరిగ్గా మొదలుకాకముందే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి.

కన్నప్ప.. సెకండ్ షెడ్యూల్ ముందు రవిశంకర్ గురూజీ బ్లెస్సింగ్స్
చాలా గ్యాప్ తరువాతవిష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు విష్ణు. కన్నప్ప సెకండ్ షెడ్యూల్ కు ముందు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాాను అంటూ తనను కలిసిన వీడియోను ఆశ్రమంలో ఏనుగులతో కాసేపు కాలక్షేపం చేసిన వీడియోను పోస్ట్ లో పేర్కొన్నాడు.

NBK109.. కన్ఫామ్ ఫీమేల్ లీడ్ గా ఊర్వశి రౌతేలా
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కాకముందే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఆకట్టుకుంటున్న సూర్య ట్రెండీ లుక్
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ.ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. సూర్య అయితే ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసేసుకున్నాడు కూడా. ఇక ఇదిలా ఉండగా తాజాగా కంగువ పోస్ట్ ఫోటోషూట్ లో భాగంగా సూర్య దిగిన స్టైలిష్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో…