మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా వస్తుంది విశ్వంభర.బింబిసార ఫేమ్ వేణు మల్లిడి డైరెక్ట్ చేస్తున్నాడు.తన మొదటి సినిమాలాగే ఇది కూడా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు అయితే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ.రీసెంట్ గా ఈసినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సూపర్ అనిపించుకుంది దాంతో ఇంకా షూటింగ్ కూడా సరిగ్గా మొదలుకాకముందే ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపటి నుండి ఈసినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ జరుగనుంది.ఈషెడ్యూల్ లో చిరంజీవి జాయిన్ కానున్నాడు.ఇందుకోసం జిమ్ చేస్తూ ఫిట్ గా రెడీ అవుతున్నాడు చిరు.అంతేకాదు దాదాపు 7నెలల విరామం అనంతరం చిరు మళ్ళీ సెట్స్ లో అడుగుపెడుతున్నాడు.
విశ్వంభరను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.వచ్చే సంక్రాంతికి ఈసినిమాను విడుదలచేయనున్నారు.గత ఏడాది చిరు సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో రాగ ఆ సినిమా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మరి విశ్వంభర కు కూడా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: