రౌడీహీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఖుషి తో డీసెంట్ హిట్ ను అందుకోగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ పై దిల్ రాజు పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. దేవర రిలీజ్ డేట్ లోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఉంటుందని చెప్పారు. దీంతో ఈ వార్తలపై పలు చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
A blockbuster entertainment bonanza is on its way! 💥💥
𝐀𝐩𝐫𝐢𝐥 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒 is your date to welcome our #FamilyStar into your hearts ♥️#FamilyStarOnApril5th@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official @TSeries @tseriessouth pic.twitter.com/7O69QIFQcn
— Sri Venkateswara Creations (@SVC_official) February 2, 2024
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: