ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ.ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. సూర్య అయితే ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసేసుకున్నాడు కూడా. ఇక ఇదిలా ఉండగా తాజాగా కంగువ పోస్ట్ ఫోటోషూట్ లో భాగంగా సూర్య దిగిన స్టైలిష్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండీ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Spreading magic in a monochrome click! 🖤
A special post-pack-up shot of @Suriya_offl after completing his photoshoot for @KanguvaTheMovie!📸#Suriya #Kanguva #TeluguFilmNagar pic.twitter.com/mXaZ8aCLSI— Telugu FilmNagar (@telugufilmnagar) January 31, 2024
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: