
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 190


హ్యాపీడేస్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

జూనియర్ షూటింగ్ లో శ్రీ లీల

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

తలైవా 171 పై లోకేష్ కనగరాజ్ అప్ డేట్

ఓం భీమ్ బుష్ 4డేస్ కలెక్షన్స్

దేవర- గోవా షూట్ లో జాయిన్ అయిన తంగం

శర్వానంద్ మనమే మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది

ఆసినిమా చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుంది
మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే కదా. అందుకే అక్కడి సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడమే కాదు రీమేక్ లు కూడా చేస్తూ వస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ఆ సినిమాలు మంచి విజయాలనే అందుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఓ మలయాళం సినిమాను చిరంజీవి-చరణ్ రీమేక్ చేస్తే బావుంటుంది అని అంటున్నాడు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.

ఓం భీమ్ బుష్ 5 డేస్ సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి శ్రీవిష్ణు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు.. మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా సతీమణి ఉపాసనతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసనలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులు కుమార్తె క్లీన్ కారాతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

గుంటూరు కారం ఓటీటీ రెస్పాన్స్ పై నాగవంశీ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ మాస్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది.

ఆపరేషన్ వాలెంటైన్- ఓటీటీలో మరో రెండు భాషల్లో అందుబాటులోకి
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

గేమ్ ఛేంజర్ నుండి.. జరగండి లిరికల్ సాంగ్ రిలీజ్
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

నాని సినిమా ఏదైనా చెప్పండి, చూస్తాను - బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
టాలీవుడ్ స్టార్ హీరోలలో నాని స్టయిలే వేరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగిన ఈ తరం నటుల్లో ఆయన ముందుంటారు. చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని.. తనదైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో సైతం అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఒకరు చేరారు.

హ్యాపీడేస్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న కూల్ డైరెక్టర్ ఎవరంటే శేఖర్ కమ్ముల పేరు ముందు వినిపిస్తుంది. ఫీల్ గుడ్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక శేఖర్ కమ్ముల నుండి వచ్చిన సినిమానే హ్యాపీడేస్. కళాశాల నేపథ్యంలో వచ్చిన ఈసినిమా 2007వ సంవత్సరంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాలో కాలేజీ లైఫ్‌తో పాటు... అందులోని స్నేహాలను, ప్రేమలను తనదైన శైలిలో చూపించాడు శేఖర్ కమ్ముల.

జూనియర్ షూటింగ్ లో శ్రీ లీల
గత ఏడాది లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అనిపించుకుంది యంగ్ హీరోయిన్ శ్రీ లీల.సెప్టెంబర్ నుండి ఈ జనవరి వరకు నెలకో సినిమా తో పలకరించింది. సెప్టెంబర్ లో స్కంద తో రాగ అక్టోబర్ లో భగవంత్ కేసరితో వచ్చింది అయితే ఇందులో హీరోయిన్ గా కాకుండా బాలయ్య కు కూతురిగా నటించింది.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.

మూడు ఓటీటీల్లో హనుమాన్
ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి హనుమాన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను అందుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం సంక్రాంతి గ్రాసర్ గా నిలిచింది.ఇక ఈసినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్సాన్స్ ను తెచ్చుకుంది.రీసెంట్ గా తెలుగు వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ లోకి రాగ అతి తక్కువ సమయంలోనే రికార్డు వ్యూస్ ను రాబట్టింది.

మిస్టర్ బచ్చన్ యాక్షన్ షురూ
షాక్ ,మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్,మాస్ రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సీక్వెన్క్ ను చిత్రీకరిస్తున్నారు.దానికి సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు హరీష్ శంకర్.

టిల్లు స్క్వేర్ సెకండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోయాయి. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యార. ఈనేపథ్యంలో తాజాగా సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రేపు ఈసినిమా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్…

తలైవా 171 పై లోకేష్ కనగరాజ్ అప్ డేట్
ఈ వయసులో కూడా రజనీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే లాల్ సలామ్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం అయితే రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టైయాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్…

ఓం భీమ్ బుష్ 4డేస్ కలెక్షన్స్
నిన్న హోలీ సందర్భంగా హాలిడే కావడతో ఓం భీమ్ బుష్ కు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు కన్నా సోమవారం ఎక్కువ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 21.75కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇదే జోరు కొనసాగిస్తే ఈ వారంలో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ఈ వీకెండ్ నుండి ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఈశుక్రవారం సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ రిలీజ్ కానుంది.

దేవర- గోవా షూట్ లో జాయిన్ అయిన తంగం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

గేమ్ ఛేంజర్ నుండి జరగండి సాంగ్ రిలీజ్ టైమ్ ఫిక్స్
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈసినిమా.. దానికి తోడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టే తెలుస్తుంది. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

దుబాయ్‌లో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ, తొలి దక్షిణాది హీరోగా రికార్డ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన.. ఆ సినిమాలోని నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే.. అంటే, మార్చి 28వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

శర్వానంద్ మనమే మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
కెరీర్ మొదటినుండీ విభిన్నమైన సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. 2022 లో ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న శర్వా 2023లో ఎలాంటి సినిమా రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

అప్ కమింగ్ మూవీస్ గురించి అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్
విక్రమ్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి ట్రాక్ లో వచ్చాడు సీనియర్ హీరో కమల్ హాసన్. ఈసినిమా 500కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది.ఇక ఈసినిమా తరువాత కమల్ వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఇండియన్ 2,ఇండియన్ 3 అలాగే కల్కి 2898 ఏడి ,తగ్ లైఫ్ సినిమాలు వున్నాయి.

ఆర్ సి 17 అప్డేట్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న 17వ సినిమా గురించి అఫిషియల్ గా అప్డేట్ వచ్చింది.గత కొన్ని రోజులు గా ఈసినిమాను సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈకాంబినేషన్ ఫిక్స్ అయ్యింది.రామ్ చరణ్ 17వ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.ఇంతకుముందు ఇదే కాంబినేషన్ లో ఇంతకుముందు రంగస్థలం వచ్చింది.ఈసినిమా హ్యుజ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.