
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 150


కల్కి సెన్సార్ కంప్లీట్

ఆర్ సి 16 షూటింగ్ అప్‌డేట్

సందీప్ కిషన్ SK30 షూటింగ్ ప్రారంభం

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్

16 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'రెడీ'

మిస్టర్ బచ్చన్- హరీష్ శంకర్ మ్యూజికల్ అప్ డేట్

మహారాజ 4 డేస్ కలెక్షన్స్

ఇండియన్ 2రిలీజ్ పై మరోసారి క్లారిటీ

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్

నవీన్ చంద్ర లెవన్ టీజర్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తన పాత్రల ద్వారా ఎలాంటి పాత్ర అయినా చేయగలడు అనే పేరును సైతం తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు అలానే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.. వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ ఏ అవకాశం వస్తే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే మంత్ ఆఫ్ మధు అనే వెబ్ సిరీస్ తో దాదా సాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఉత్తమ నటుడిగా కూడా అవార్డును సొంతం చేసుకున్నాడు.

కల్కి సెన్సార్ కంప్లీట్
ప్రభాస్ కల్కి 2898 ఏడి మరో 8రోజుల్లో థియేటర్లోకి రానుంది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈసినిమా.ఇక ఈసినిమాకు సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.దాదాపు 3గంటల రన్ టైంతో రానుంది.సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. విజువల్స్ అదిరిపోయాయని ఎంటర్టైన్మెంట్,ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపి సినిమా ఉందట.ఇలా రిలీజ్ కు ముందే పాజిటివ్ రివ్యూస్ రావడం తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.

శర్వా 37నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్
రీసెంట్‌గా మనమేతో వచ్చి డీసెంట్ హిట్ కొట్టాడు హీరో శర్వానంద్. ఇప్పటికీ ఈ సినిమా పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత శర్వా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో 37వ సినిమా ఒకటి. సామజవరగమనతో బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని హీరోయిన్ ను పరిచయం చేశారు.

ఆర్ సి 16 షూటింగ్ అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చెప్పేశాడు ఆ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సనా.రీసెంట్ గానే ఈసినిమా లాంచ్ అయ్యింది.రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.ఫ్యాన్స్ అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలు కానుందని బుచ్చి బాబు రివీల్ చేశాడు.

లవ్ మౌళి ఓటీటీ పార్టనర్ లాక్
ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని రోజులకే ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. సూపర్ హిట్ సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తున్నా కొన్ని సినిమాలు అయితే మాత్రం రిలీజ్ అయిన పది రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చేసింది నవదీప్ లవ్ మౌళి సినిమా. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

సందీప్ కిషన్ SK30 షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశారు. కాగా ఇది సందీప్ కిషన్‌కు ల్యాండ్‌మార్క్ (30వ) చిత్రం కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ #SK30గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు 'ధమాకా' ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇందులో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుంది.

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శివం భజే. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఇక ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.

తండేల్ షూటింగ్.. శ్రీకాకుళంలో సందడి చేసిన నాగచైతన్య, సాయిపల్లవి
టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కానున్న చిత్రాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న తండేల్‌కు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా. తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం గా గౌరవం దక్కడంతో పాటు నాలుగు శాఖలను కూడా పవన్ కు కేటాయించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు.

సల్మాన్ ఖాన్-మురుగదాస్ కాంబోలో 'సికందర్' ప్రారంభం
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ 'సికందర్'. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనుండటం విశేషం. కాగా గతంలో మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం రమణ (తెలుగులో ఠాగూర్)ను సల్మాన్ ఖాన్ హిందీలో 'జై హో' పేరుతో తీసి విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

కల్కి2898AD నుండి శోభన ఫస్ట్ లుక్ రిలీజ్
త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్, స్పెషల్ వీడియోస్ ఎన్నో రిలీజ్ చేశారు.

లక్కీ భాస్కర్- మెలోడియస్ శ్రీమతి గారు ఫస్ట్ సింగిల్ రిలీజ్
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. . ప్రస్తుతం అయితే మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

16 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'రెడీ'
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే ఏవో కొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అవుతుంటాయి. వాటిలో కూడా ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకునేలా ఉండేవాటిని వేళ్ళపై లెక్కించొచ్చు. కానీ ఏళ్ళు గడుస్తున్నా గుర్తుండేవి మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటివాటిలో ఒకటే 'రెడీ' సినిమా. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వస్తున్నా చూడటానికి అమితాసక్తి కనబరుస్తుంటారు ఆడియెన్స్. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సీన్స్, డైలాగ్స్ నేడు మీమ్స్ రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటాయి. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్ళు అవుతోంది.

మిస్టర్ బచ్చన్- హరీష్ శంకర్ మ్యూజికల్ అప్ డేట్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు రవితేజ. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి షోరీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

ఆకట్టుకుంటోన్న డార్లింగ్ ఫస్ట్ సింగిల్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

కాలినడకన తిరుమల కొండపైకి త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దైవభక్తి ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇది ఆయన రచయితగా పనిచేసిన, అలాగే దర్శకత్వం వహించిన చిత్రాలలో మనకు అర్ధమవుతుంది. పురాణాలు, ఇతిహాసాలు రిఫెరెన్స్‌గా సినిమాలోని ఎదో ఒక పాత్రతో సందర్భానుసారం కొన్ని డైలాగ్స్ చెప్పిస్తుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా ఆయన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

కల్కి ప్రమోషన్స్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేసిన నాగ్ అశ్విన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.

మహారాజ 4 డేస్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు 'కురంగు బొమ్మై' ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన 'మహారాజ' చిత్రానికి 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

ఇండియన్ 2రిలీజ్ పై మరోసారి క్లారిటీ
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారతీయుడు2. ఈసినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా మొదలైన తరువాత ఎన్ని సమస్యలు వచ్చాయో తెలిసిందే. మధ్యలో ఈ మూవీని ఆపేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ స్టార్ట్ చేశారు. ఎలాగోలా షూటింగ్ ను పూర్తిచేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

శివం భజే ఫస్ట్ గ్లింప్స్ కు టైమ్ ఫిక్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక ఈమధ్య హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా వస్తున్న సినిమా శివం భజే. ఈసినిమా టైటిల్ ను ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఆతరువాత అయితే ఎలాంటి అప్ డేట్ రాలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.