గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చెప్పేశాడు ఆ సినిమా డైరెక్టర్ బుచ్చి బాబు సనా.రీసెంట్ గానే ఈసినిమా లాంచ్ అయ్యింది.రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.ఫ్యాన్స్ అయితే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలు కానుందని బుచ్చి బాబు రివీల్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ఆసినిమా టీంతో బుచ్చి బాబు ఇంటర్వ్యూ చేశాడు.ఇందులో బుచ్చి బాబు ఆర్ సి 16 షూటింగ్ గురించి చెప్పేశాడు.అలాగే విజయ్ సేతుపతి కూడా ఆర్ సి 16 గురించి మాట్లాడాడు. కథ తనకు తెలుసునని సినిమా అదిరిపోతుందని పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ చెప్పొకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో వున్నాడు. ఈవారం లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ కానుంది.వచ్చే నెలలో షూటింగ్ అంతా పూర్తికానుంది.సినిమాను అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























