పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టైటిల్, గ్లింప్స్, టీజర్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. తాజాగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా బాలీవుడ్ సింగర్ దిల్జిత్‌తో కలిసి ప్రభాస్ బైరవ యాంథమ్ సాంగ్‌ను లాంఛ్ చేయగా ఐదు మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా.. ఆయన ఫ్రెండ్ బుజ్జిగా స్పెషల్ కారు కనిపించనుంది. ఇక ఇదిలావుంటే కల్కి మూవీ ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది. అక్కడ విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ సేల్స్‌లో అతి తక్కువ రోజుల్లో 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అధిగమించింది. కాగా కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు. దీనిలో భాగంగా ‘వరల్డ్ ఆఫ్ కల్కి’ పేరుతో వీడియోలు విడుదల చేయనున్నారు. వీటిని పలు ఎపిసోడ్స్ రూపంలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి ఎపిసోడ్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘ఎపిక్ జర్నీ ఎపిసోడ్ 1 – ది ప్రిల్యూడ్ ఆఫ్ కల్కి 2898AD’ వీడియోను విడుదల చేసిన ఆయన అందులో కల్కి 2898 AD చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నాగ్ అశ్విన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “నా ఫెవరేట్ మూవీ పాతాళ భైరవి. ఆ తరువాత భైరవద్వీపం, ఆదిత్య 369 బాగా నచ్చాయి. అలాగే హాలీవుడ్‌లో స్టార్ వార్స్ సిరీస్ మూవీస్ ఇష్టం. అయితే అవి మన స్టోరీలు కావు. కానీ కల్కి మన స్టోరీ. అలాగే అన్ని దేశాలవారికి ఇది రిలేటెడ్‌గా ఉంటుంది. మహాభారతంలో ఎన్నో పాత్రలుంటాయి. పురాణాల ప్రకారం.. శ్రీకృషుడి అవతారం ఇక్కడితో ఎండ్ అవుతుంది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కలియుగం ఎంటర్ అయ్యాక వచ్చే విష్ణుమూర్తి పదో అవతారం కల్కి. ఒకవేళ ప్రస్తుత కాలంలో కల్కి అవతారం ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ కథ. ఈ కథ అన్నింటికి క్లైమాక్స్. ఇప్పటివరకు మనం చదివిన పురాణాలు అన్నింటికి ఒక ఎండ్ లాగా ఈ సినిమాను తీశాం. కలి పురుషుడు ఒక్కో యుగంలో ఒక్కో రూపంలో ఉంటాడు అనుకుంటే, అతడిని ఎదుర్కొనే కల్కి పాత్రలో హీరోను చూపిస్తున్నాం” అని చెప్పారు నాగ్ అశ్విన్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: