మిస్టర్ బచ్చన్- హరీష్ శంకర్ మ్యూజికల్ అప్ డేట్

harish shankar musical update on ravi tejas mr bachchan movie

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు రవితేజ. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి షోరీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు హరీష్ శంకర్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా మ్యూజికల్ అప్ డేట్ ఇచ్చాడు. గతంలో తన సినిమాలు గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక, అలానే దువ్వాడ జగన్నాథం సినిమాలోని అస్మైక యోగ అనే పాటను రాసిన లిరిసిస్ట్ సాహితి ఈసినిమాలో కూడా ఒక మంచి రొమాంటిక్ ట్రాక్ రాసిందని.. ఈ సాంగ్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నా.. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని తెలిపాడు.

కాగా ఈసినిమా బాలీవుడ్ లో వచ్చిన అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.