టాలీవుడ్ మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దైవభక్తి ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇది ఆయన రచయితగా పనిచేసిన, అలాగే దర్శకత్వం వహించిన చిత్రాలలో మనకు అర్ధమవుతుంది. పురాణాలు, ఇతిహాసాలు రిఫెరెన్స్‌గా సినిమాలోని ఎదో ఒక పాత్రతో సందర్భానుసారం కొన్ని డైలాగ్స్ చెప్పిస్తుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా ఆయన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్య సౌజన్య, కుమారుడు రిషితో కలిసి సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి వచ్చారు. రాత్రి తిరుమలలోనే బసచేసిన త్రివిక్రమ్ కుటుంబం మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ సినిమా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా కనిపించారు. ఇక ఈ మూవీలోని ‘కుర్చీ మడత పెట్టి’ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త చిత్రం ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”-zX0-1Kajuw,jFHYesbnuIY,SQz2lghKY1Y,CNdzS
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: