తండేల్‌ షూటింగ్.. శ్రీకాకుళంలో సందడి చేసిన నాగచైతన్య, సాయిపల్లవి

Naga Chaitanya and Sai Pallavi Arrives Srikakulam For Thandel Shooting

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కానున్న చిత్రాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్‌’. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుంది. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న తండేల్‌కు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ – చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న తండేల్‌ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇక తండేల్‌ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపించి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే సాయి పల్లవిని ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన సత్య మేకింగ్‌ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో షూటింగ్‌ దశలో ఉండగానే ఈ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో ఇటీవలే విశాఖపట్నంలో షూటింగ్ ముగించుకున్న తండేల్‌ టీం తాజాగా శ్రీకాకుళం చేరుకుంది. షూట్‌లో భాగంగా బుధవారం చైతూ, సాయిపల్లవి శ్రీకాకుళంలో సందడి చేశారు. వీరికి అక్కినేని అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇక అభిమాన తారలు రావడంతో పట్టణంలో భారీ ఎత్తున ప్రజలు గుమికూడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.