16 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘రెడీ’

Ram Pothineni, Srinu Vaitla Block Buster Movie Ready Completes 16 Years

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే ఏవో కొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అవుతుంటాయి. వాటిలో కూడా ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకునేలా ఉండేవాటిని వేళ్ళపై లెక్కించొచ్చు. కానీ ఏళ్ళు గడుస్తున్నా గుర్తుండేవి మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటివాటిలో ఒకటే ‘రెడీ’ సినిమా. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వస్తున్నా చూడటానికి అమితాసక్తి కనబరుస్తుంటారు ఆడియెన్స్. ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సీన్స్, డైలాగ్స్ నేడు మీమ్స్ రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటాయి. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్ళు అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ ట్రెండ్ సెట్టర్ మూవీపై ఓ స్పెషల్ స్టోరీ. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 2008లో విడుదలైన ఈ సినిమాలో రామ్ పోతినేని, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, నాజర్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్. నారాయణ, సునీల్, శ్రీనివాస రెడ్డి, సుధ, ప్రగతి, శరణ్య, సురేఖ వాణి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే తమన్నా, నవదీప్, నాగబాబు అతిథి పాత్రలలో కనిపించి సందడి చేశారు.

కాగా సున్నితమైన కథాంశాలను కామెడీ జానర్‌లో ప్రజెంట్ చేయడం డైరెక్టర్ శ్రీను వైట్ల శైలి. ఇదే కోవలో వచ్చిందే ‘రెడీ’. ముఖ్యంగా కథ కన్నా కూడా కథనాన్ని నడిపిన తీరే ఈ సినిమాకు హైలైట్. రెగ్యులర్ ఫార్ములా స్టోరీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే జోడించి మ్యాజిక్ చేశారు శ్రీను వైట్ల. అందుకే ఈ చిత్రం విడుదలయ్యాక నటీనటుల పర్‌ఫార్మెన్స్ కన్నా సినిమాకు పనిచేసిన రైటింగ్ బృందానికి ఎక్కువగా ప్రశంసలు వచ్చాయి. ఈ కథకు ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ సహకారం అందించారు. అంతకుముందు ‘ఢీ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ టీమ్ ‘రెడీ’తో మరోసారి సక్సెస్ అందుకుంది.

ఈ చిత్రంలో తనకు ఎదురయ్యే అనేక చిక్కుముడులను నేర్పుగా పరిష్కరించే కథానాయకుడు చందుగా రామ్ పోతినేని, పూజగా జెనీలియా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఆయన మంచి స్టార్‌డమ్ అందుకున్నారు. ఇక మెక్‌డోవెల్ మూర్తిగా బ్రహ్మానందం, సంతోష్ రెడ్డి అలియాస్ హ్యాపీ రెడ్డిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్స్ అద్భుతంగా పేలాయి. అలాగే చికాగో సుబ్బారావు, డల్లాస్ నాగేశ్వరరావు అనే పాత్రలు, వాటిని క్రియేట్ చేసిన విధానం సూపర్బ్. ఇంకా చిట్టి నాయుడు పాత్రలో జయప్రకాశ్ రెడ్డి, ఆయన మనవడు జూనియర్ చిట్టి నాయుడుగా మాస్టర్ భరత్ నటన ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

కాగా ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో సహా మూడు నంది పురస్కారాలు దక్కాయి. అలాగే 2009లో కన్నడంలో ‘రాం’ అనే పేరుతో, 2010లో తమిళంలో ‘ఉత్తమ పుదిరన్’ అనే పేరుతో అక్కడా భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే 2011లో హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘రెడీ’ పేరుతోనే రీమేక్ చేయగా ఆయన సూపర్ హిట్ అందుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.