మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. . ప్రస్తుతం అయితే మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే చిత్రయూనిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. శ్రీమతి గారు అంటూ వచ్చే మెలోడియస్ ఫస్ట్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ చేశారు. కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచం కూల్ అవ్వండి మేడం గారు.. చామంతి నవ్వే విసిరే మీరు.. కసిరేస్తూ ఉన్నా బావున్నారు అంటూ వచ్చే ఈపాట ఆకట్టుకుంటుంది. విశాల్ మిశ్రా, శ్వేత మోహన్ రాసిన ఈపాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























