మహారాజ 4 డేస్ కలెక్షన్స్

Vijay Sethupathi's Maharaja Collects Rs.40 Cr in 4 Days

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ మైల్ స్టోన్ సినిమాకు ‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శక,నిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, సీనియర్ నటి అభిరామి, నట్టీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందిన ‘మహారాజ’ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్‌ సహా ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఇక రిలీజైన తొలిరోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ రివేంజ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎప్పటిలాగే మక్కళ్‌ సెల్వన్‌ తనదైన నటనతో అదరగొట్టగా.. డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను కట్టిపడేస్తోంది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేశ్, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని సహా అనేకమంది మహారాజను వీక్షించి నిథిలన్ డైరెక్షన్ మరియు విజయ్ సేతుపతి నటనను కొనియాడారు. ఈ నేపథ్యంలో మహారాజ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళనాట రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మహారాజ ఫస్ట్ వీకెండ్‌లో రూ. 32.6 కోట్లు.. నాలుగు రోజులకు రూ.40 కోట్లకు పైగా రాబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ ఏడాది రిలీజైన తమిళ చిత్రాలలో ఫస్ట్ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కాగా మహారాజ మూవీ తొలి రోజు కంటే నాలుగో రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో ఈ వారాంతానికి రూ. 100 కోట్లు అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.