ప్రభాస్ కల్కి 2898 ఏడి మరో 8రోజుల్లో థియేటర్లోకి రానుంది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈసినిమా.ఇక ఈసినిమాకు సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.దాదాపు 3గంటల రన్ టైంతో రానుంది.సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. విజువల్స్ అదిరిపోయాయని ఎంటర్టైన్మెంట్,ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపి సినిమా ఉందట.ఇలా రిలీజ్ కు ముందే పాజిటివ్ రివ్యూస్ రావడం తో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కంటెంట్ మీద వున్న నమ్మకం తో కల్కి టీం పెద్దగా హడావిడి చేయడం లేదు.అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు.ఈ ఈవెంట్ కు ప్రభాస్ తోపాటు మిగితా టీం హాజరుకానుంది.చాలా రోజుల తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కూడా ఇదే. టార్గెట్ కూడా భారీగానే వుంది.సేఫ్ కావాలంటే బాస్టర్ టాక్ రావాల్సిందే.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె ,దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























