త్వరలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్, స్పెషల్ వీడియోస్ ఎన్నో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో శోభన కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా తనకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో ఆమె పూర్వీకులు కూడా ఆమె లాగే వేచి ఉన్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మిరియం పాత్రలో శోభన కనిపించనుంది.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























