ఆకట్టుకుంటోన్న డార్లింగ్‌ ఫస్ట్ సింగిల్

Darling First Song Out From Priyadarshi and Nabha Natesh's Movie

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాతో తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవరి?’ అనేది టాగ్ లైన్‌గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చైతన్య రెడ్డి సగర్వంగా సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉండగా మేకర్స్‌ అప్పుడే ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా డార్లింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఖలసే..’ అంటూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం, వివేక్‌ సాగర్‌ మ్యూజిక్ అందించగా.. హనుమాన్‌ సీహెచ్‌, రామ్‌ మిరియాల కలిసి ఆలపించారు. ఇక కామన్‌ మ్యాన్‌ ఫ్రస్టేషన్‌ తెలిపేలా ఉన్న ఈ పాటలో ప్రియదర్శి తన డాన్స్‌తో అలరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.