సల్మాన్ ఖాన్-మురుగదాస్ కాంబోలో ‘సికందర్’ ప్రారంభం

Salman Khan-AR Murugadoss Combo Movie Sikandar Shoot Begins

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించనుండటం విశేషం. కాగా గతంలో మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం రమణ (తెలుగులో ఠాగూర్)ను సల్మాన్ ఖాన్ హిందీలో ‘జై హో’ పేరుతో తీసి విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సికందర్ నుంచి సాలిడ్ అప్‌డేట్ వ‌చ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ముంబైలో ఈ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మేరకు మంగ‌ళ‌వారం షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు, నిర్మాతతో కలిసి ఉన్న ఫోటోను స‌ల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాను 2025 ఈద్ కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాగా సికందర్ సినిమాను గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియడ్‌వాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే ఈ మూవీలో స్టార్ క్యాస్టింగ్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా.. సత్యరాజ్ ప్రతినాయకుడిగా నటించనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.