రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఇక ఈమధ్య హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా వస్తున్న సినిమా శివం భజే. ఈసినిమా టైటిల్ ను ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఆతరువాత అయితే ఎలాంటి అప్ డేట్ రాలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది. ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పంచ్ పేరిట్ రాబోయే వీడియో ను రేపు అంటే జూన్19వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలుపుతూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా ‘హైపర్’ ఆది కీీలక పాత్రలో నటించనున్నాడు. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























