కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భారతీయుడు2. ఈసినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా మొదలైన తరువాత ఎన్ని సమస్యలు వచ్చాయో తెలిసిందే. మధ్యలో ఈ మూవీని ఆపేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ స్టార్ట్ చేశారు. ఎలాగోలా షూటింగ్ ను పూర్తిచేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా పలు మార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొద్ది రోజుల నుండి జులై లో కూడా సినిమా రావడం కష్టమన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు క్లారిటీ వచ్చేసింది. ఈసినిమా జులై లోనే రానున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ ఈసినిమా థియేటర్స్ లో జూలై 12 నుంచే వస్తుంది అని పోస్టర్ రిలీజ్ చేస్తూ కన్ఫామ్ చేశారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























