
ట్యాగ్ · 1187 కథనాలు · పేజీ 37


ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్

కృష్ణ వ్రింద విహారి' ఎవర్ గ్రీన్ మూవీ

ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను - చిరంజీవి

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ప్రారంభం

సినిమాలలో పాత్రలకై రకుల్ ప్రీత్ సెల్ఫ్ ట్రైనింగ్

సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణ వ్రింద విహారి

#SSMB28 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

3D ఫార్మాట్ లో కార్తికేయ3

ఇండియన్ 2 షూట్ లో జాయిన్ అయిన కమల్

#NC 22 మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా ఎస్ ఆర్ కథిర్

రజనీకాంత్ లుక్స్ తో రాఘవ లారెన్స్

ఆది పురుష్ పవర్ ఫుల్ సీఎం తో టీజర్ రిలీజ్?

#SSMB28 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

బ్రహ్మాస్త్ర 2 లో ఆ హీరోయిన్ ఉండాలనుంది?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియాభట్ జంటగా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెత్, భారీ తారాగణంతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా లాభాలనే గణించారు. ఇక మరికొద్ది రోజుల్లో ఈసినిమా సెకండ్ పార్ట్ మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే కదా. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది. ఈ పార్ట్ లో ఇప్పుడున్న తారాగణంతో పాటు మరికొంత మంది కొత్తవారు యాడ్ అవుతారు.

కోలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా విక్రమ్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విక్రమ్ జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విక్రమ్ మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ బ్యాక్ టు సలార్ సెట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్…

కృష్ణ వ్రింద విహారి' ఎవర్ గ్రీన్ మూవీ
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నాగశౌర్య విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ప్రేక్షకుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను - చిరంజీవి
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో 4 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. చిరంజీవి టాలీవుడ్ కు పరిచయం అయిన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యింది. చిరంజీవి టాలీవుడ్ లో 44 సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ ప్రారంభం
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమాను హై బడ్జెట్ తో పీరియడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. అయితే మరోపక్క ఈసినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలకు సంబంధించి వరుసగా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వస్తున్న అప్‌డేట్‌తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక నేడు ఈసినిమా పూజా కార్యక్రమాలతో చెన్నైలో ప్రారంభమయింది. ఇక ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ అందరూ పాల్గొన్నారు.

సినిమాలలో పాత్రలకై రకుల్ ప్రీత్ సెల్ఫ్ ట్రైనింగ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ , మిషన్ సిండ్రెల్లా , చ్ఛాత్రివాలి ( హిందీ) శివ కార్తికేయన్ అయలాన్ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న 31 అక్టోబర్ లేడీస్ నైట్ మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తునివు తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణ వ్రింద విహారి
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా గత కొంత కాలంగా తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక చిత్రయూనిట్ కూడా ఎక్కడా రాజీపడకుండా ప్రమోషన్ కార్యక్రమాలుఅయితే చేశారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చిత్రయూనిట్ పాదయాత్ర కూడా చేసింది…

#SSMB28 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం…

కీర్తి సురేష్ ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ కు సిద్ధం
నేను శైలజ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ , బ్లాక్ బస్టర్ మహానటి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు. దసరా(తెలుగు ), మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబలే ఫిల్మ్స్…

3D ఫార్మాట్ లో కార్తికేయ3
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2 ఎంత సంచలన విజయం సాధించిందో చూశాం. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈసినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ద్వారక నేపథ్యంలో కృష్ణుని కంకణం కథాంశం ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంది. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు నార్త్ అడియెన్స్‌కు కూడా నచ్చేసింది. నచ్చడమే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటి సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

ఇండియన్ 2 షూట్ లో జాయిన్ అయిన కమల్
ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. చాలా గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యి పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లైకాతో కూడా వివాదలు తలెత్తాయి. అయితే పలు చర్చల అనంతరం ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

#NC 22 మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా ఎస్ ఆర్ కథిర్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య , కృతి శెట్టి జంటగా తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న NC 22 మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకులు బోయపాటి , భారతీ రాజా , శివ కార్తికేయన్ , రానా అతిథులు గా పాల్గొన్నారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.

రజనీకాంత్ లుక్స్ తో రాఘవ లారెన్స్
డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ గా పలు సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ మూవీస్ కు లారెన్స్ పెట్టిందిపేరు గా మారారు. దర్శకుడిగా మారి లారెన్స్ పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు. లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ , అధికారం , చంద్రముఖి 2 మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఆది పురుష్ పవర్ ఫుల్ సీఎం తో టీజర్ రిలీజ్?
ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అందులో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండటంతో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు.

సీతా రామం మూవీ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రశంసలు
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతా రామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది.సీతా రామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లు గ్రాస్…

విక్టరీ వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉంది - విశ్వక్ సేన్
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపాల గోపాల మూవీ లో పవన్ కళ్యాణ్ దేవుడిగా అలరిస్తే , ఈ మూవీ లో దేవుడిగా ప్రేక్షకులను అలరించనున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్ తో వర్క్ చేయాలని ఉంది - గౌతమ్ వాసుదేవ్ మీనన్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు గౌతమ్ తెలుగు లో ఏ మాయ చేసావె , ఘర్షణ వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. Dr గణేశ్ సమర్పణలో వెల్ ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , సిద్ధి ఇద్నానీ జంటగా ఒక పల్లెటూరి యువకుడు గ్యాంగ్ స్టర్ ఎదిగిన నేపథ్యంలో తెరకెక్కిన వెందు తణీంధదు కాడు తమిళ మూవీ తెలుగు వెర్షన్ ను ది లైఫ్ ఆఫ్ ముత్తు ఘనవిజయం సాధించాయి. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ ని స్రవంతి మూవీస్ రిలీజ్ చేసింది.

#SSMB28 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
అతడు, ఖలేజా సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్ మొదలుపెట్టనంత వరకూ ఓకే కానీ.. ఒక్కసారి షూటింగ్ ను మొదలుపెడితే కనుక మహేష్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిపోతుంటాడు. ఈనేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను అలా స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్…

ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో నాగార్జున కూడా ఒకరు. నాగార్జున మాత్రం ఫుల్ స్పీడుమీదున్నారు. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో సందడి చేశారు. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.