కోలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా విక్రమ్

Vikram Movie Latest Update,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Vikram.Vikram Movie,Vikram Movie Latest Updates,Vikram Movie Latest Collection Updates,Vikram Movie Collections,Vikram Movie Industry Hit,Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Vikram Movie,Kamal Haasan Vikram Movie Latest Collection Updates,Kamal Haasan Latest Blockbuster Movie Vikram,Kamal Haasan Latest Industry Hit Movie Vikram,Vikram Movie All Time Industry collections,Vikram Movie Kollywood Industry Hit,Vikram Movie Latest Recorde Collections in Kollywood

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విక్రమ్ జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విక్ర‌మ్ మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణతో 500 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇంత వరకు ఏ తమిళ సినిమా ఇంత భారీ వసూళ్లను సాధించలేదు. ఇప్పటికే తమిళనాడులో.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వసూళ్లను అధిగమించింది. థియేటర్లలో 113 రోజుల పాటు ఆడిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఏడాది జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా తొలి వారంలోనే రూ.164.75 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.