ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అందులో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండటంతో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ గురించి ఎప్పటినుండో పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఢిల్లీ లో జరిగే ప్రతిష్టాత్మక దసరా మహోత్సవాలు లో ప్రభాస్ పాల్గొనడం కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లవ్‌కుశ్ రాంలీలా కమిటీ ఎర్రకోట వద్ద అయోధ్యలోని రామాలయం థీమ్‌పై మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుడి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను ఈ కమిటీ ఆహ్వానిస్తుంటుంది. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఇక ఆ సమయంలోనే ఆదిపురుష్ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ టీజర్ ను ఓ పవర్ ఫుల్ సీఎం చేత రిలీజ్ చేయించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సీఎం ఎవరో కాదు యోగి ఆదిత్యనాథ్ చేత ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే టీజర్ అప్ డేట్ వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: