వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతా రామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది.సీతా రామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ , 40 కోట్లు షేర్ సాధించి, దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. సీతారామం మూవీ చూసి అద్భుతమైన అనుభూతిని పొందాననీ , ఈ మూవీ ఒక ఎపిక్ లవ్ స్టోరీ అనీ , అద్భుతమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కు హను రాఘవపూడికి అభినందనలనీ , అన్ని విభాగాల్లో పనితనం బాగుందనీ , ఈ సినిమాలో నటించిన నటీ, నటులందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , మృణాల్ నటన ప్రత్యేకంగా నచ్చిందనీ , ఆమె భావోద్వేగాలు, ప్రవర్తన, హుందాతనం ఇతర ఏ నటికి సాధ్యం కాదనీ , నిజంగా క్వీన్ మాదిరిగా ఉందనీ , ఠాకూర్ మీకు జిందాబాద్ అనీ , ఇక్కడ మీ పాలన ప్రారంభమవుతుందనీ కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: