యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో నాగార్జున కూడా ఒకరు. నాగార్జున మాత్రం ఫుల్ స్పీడుమీదున్నారు. ఈఏడాది ఇప్పటికే బంగార్రాజు, బ్రహ్మాస్త్ర సినిమాలతో సందడి చేశారు. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దీనికోసం డేట్ ను వేదికను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు టీమ్ అంతా హాజరుకానున్నారు.
Get Ready for the Grand Pre-Release Event of high octane action entertainer #TheGhost on 25th Sep, 6PM onwards🤩
📍STBC College Grounds, Kurnool
🎟️https://t.co/B7QRBnPlv2#TheGhostOnOct5@iamnagarjuna @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @SonyMusicSouth pic.twitter.com/7MSI8syyF1— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 21, 2022
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: