ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. చాలా గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే కమల్ ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయ్యి పలు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లైకాతో కూడా వివాదలు తలెత్తాయి. అయితే పలు చర్చల అనంతరం ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు శంకర్ కూడా రామ్ చరణ్ తో సినిమా చేస్తూనే ఇండియన్2 సినిమా షూటింగ్ కూడా పార్లల్ గా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆదిశగానే షూటింగ్ ను జరుపుతున్నారు. ఇన్ని రోజులు విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న కమల్ ఇక ఇప్పుడు ఇండియన్ 2 సినిమాను మళ్లీ మొదలుపెట్టారు. ఇక ఈవిషయాన్ని కమల్ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కమల్ హాసన్ తో పాటు కాజల్ తదితరులు కూడా షూట్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంతో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
#Indian2 from today.
@Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE— Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: