సెన్సార్ పూర్తిచేసుకున్న కృష్ణ వ్రింద విహారి

krishna vrinda vihari movie censor completed, krishna vrinda vihari completed its censor formalities, Krishna Vrinda Vihari Movie clears censor formalities, Krishna Vrinda Vihari Movie Gets U/A certificate by CBFC, Krishna Vrinda Vihari Telugu Movie Review, Krishna Vrinda Vihari Movie Review, Krishna Vrinda Vihari Review, Krishna Vrinda Vihari Telugu Review, Krishna Vrinda Vihari First Review, Krishna Vrinda Vihari Movie Review And Rating, Krishna Vrinda Vihari Critics Review, Krishna Vrinda Vihari Story review, Krishna Vrinda Vihari Movie Highlights, Krishna Vrinda Vihari Movie Plus Points, Krishna Vrinda Vihari Movie Public Talk, Krishna Vrinda Vihari Movie Public Response, Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari Movie, Krishna Vrinda Vihari Movie Updates, Krishna Vrinda Vihari Telugu Movie Live Updates, Krishna Vrinda Vihari Telugu Movie Latest News, Naga Shaurya, Shirley Setia, Mahati Swara Sagar, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా గత కొంత కాలంగా తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా కృష్ణ వ్రింద విహారి. అనీష్​ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇక చిత్రయూనిట్ కూడా ఎక్కడా రాజీపడకుండా ప్రమోషన్ కార్యక్రమాలుఅయితే చేశారు. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చిత్రయూనిట్ పాదయాత్ర కూడా చేసింది. ఏపీలో పది ప్రధాన నగరాల్లో పాదయాత్ర చేశారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. ఇక తాజాగా ఈ సినిమ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ మూవీకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. కాగా ఈ మూవీ మొత్తం 2 గంటల 19 నిమిషాల రన్ టైం సాగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో షిర్లే సెటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు పలు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =