బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “బంగార్రాజు ” మూవీ లో నాగచైతన్య కు జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన కృతి , నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. అక్కినేని నాగచైతన్య తో మరోసారి కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందనీ , తమ జంటను చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడతారని అనుకుంటున్నాననీ , చైతూతో కలిసి పనిచేస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందనీ , చైతూ ఎంతో నిజాయితీగా ఉంటారనీ , ఆయనది స్వచ్ఛ మనసనీ , నాగ చైతన్యలోని ఈ గుణాలు తనకు స్పూర్తిని ఇస్తాయనీ , నాగ చైతన్యతో కలిసి పనిచేసినప్పుడు తనకు రిఫ్రెష్‌గా ఉంటుందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: