టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా అనుకున్నతం విజయాన్ని అయితే అందించలేకపోయింది. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా తన తరువాత సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా పూర్తి చేస్తున్నాడు. ఈసినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది కూడా. ఇక ఈసినిమాతో పాటు వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా కూడాచేస్తున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే ఈసినిమా షటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు ఈసినిమా సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా గ్లింప్స్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. వైబ్ ఆఫ్ వినరో భాగ్యము విష్ణు కథ పేరుతో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. జులై14 వ తేదీన ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
𝑽𝑰𝑩𝑬 of #𝑽𝒊𝒏𝒂𝒓𝒐𝑩𝒉𝒂𝒈𝒚𝒂𝒎𝒖𝑽𝒊𝒔𝒉𝒏𝒖𝑲𝒂𝒕𝒉𝒂 – A video 𝑮𝑳𝑰𝑴𝑷𝑺𝑬 out tomorrow @ 5:02PM!💫💚#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @ItsChavan @GA2Official pic.twitter.com/H3Rd7qpLTM
— Geetha Arts (@GeethaArts) July 13, 2022
కాగా ఈ సినిమాకి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా కశ్మీర హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ఈసినిమాను నిర్మిస్తున్నారు. అలాగే చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























