“విక్రమ్ ” మూవీ ఓటీటీ రికార్డ్

Vikram Movie Creates A New Record On OTT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Movie in OTT,Kamal Haasan Vikram Movie,Vikram Movie in Disney Hotstar Vikram Movie OTT Creates Record,Kamal Haasan Vikram Movie Creates Records in OTT,Kamal Haasan Upcoming Movie,Kamal Haasan New Movie Updates, Vikram Movie Streaming in OTT Now,Vikram Movie Streaming in Disney Plus Hotstar

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతూ తమిళనాడు , సింగపూర్ , యూకె , యు ఏ ఈ , కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. “విక్రమ్” సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “విక్రమ్ “మూవీ తెలుగు తమిళ హిందీ భాషలతో పాటు కన్నడ, మలయాళ వెర్షన్స్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో జూలై 8వ తేదీ స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించి.. ఓటీటీలో రికార్డ్ సృష్టించింది.ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “విక్రమ్” చిత్రంతో ప్రేక్షకులు అందించిన అపూర్వ విజయం మాకెంతో సంతోషాన్నిచ్చిందనీ , ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ ఈ సినిమా చేరిందనీ , దేశవ్యాప్తంగా ఐదు భాషల్లోనూ హయ్యెస్ట్ వీకెండ్ వ్యూయర్ షిప్ సాధించడం ఆనందంగా ఉందనీ చెబుతూ , మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ అని అన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.