హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు హనురాఘవపూడి. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఒక అప్ డేట్ తరువాత మరో అప్ డేట్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, గ్లింప్స్, వరుసగా పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సుమంత్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలక పాత్రకు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేసారు. పెళ్లి పీటలు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. బాలాజీ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని కూల్ డ్రింక్ తాగుతూ కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“Balaji hai na.. sab sambhal lega”.
Introducing @TharunBhasckerD as 𝐁𝐚𝐥𝐚𝐣𝐢 from #SitaRamam.https://t.co/09cTI4qvZ2@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/2r3lOP7B4i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 13, 2022
కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తుండగా మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. ఇక ఈసినిమాలో సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: