తమిళ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వంలో 2014లో పిశాచి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. నాగ సాయి ప్రతీష్, ప్రయాగ మార్టీన్ జంటగా నటించిన ఈసినిమా అప్పట్లో ఎంత ఘనవిజయం సాధించిందో కూడా విదితమే. హర్రర్ థ్రిల్లర్‌గా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ పిశాచి2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా కూడాఎప్పుడో మొదలై మద్యలో కరోనా రావడంతో షూటింగ్ ఆలస్యమువుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగష్ట్ 31వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఆండ్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా పూర్ణ , సంతోష్ ప్రతాప్ , అజ్మల్ అమీర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. “మక్కల్ సెల్వన్”విజయ్ సేతుపతి” కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: