టాలీవుడ్ లో అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఒకేసారి రెండు మూడు సినిమాలు కాదు కానీ ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక నాగార్జున కూడా అదే బాటలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమా వస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు 100 సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం నాగ్ చేస్తున్న ది ఘోస్ట్ సినిమా 98వ సినిమా. 99వ సినిమా పై ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు కానీ అప్పుడే 100వ సినిమాపై ఒక వార్త తెరపైకి వచ్చింది. 100 వ సినిమాకి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే నాగ్ కథ వినేశారనీ.. కొన్ని మార్పులు చెప్పారని అంటున్నారు కూడా అంటున్నారు. మరి 100 సినిమా అంటే చాలా స్పెషల్. మరి ఈ వార్తలైతే ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: