నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నెం 1 మూవీ గా “అంటే .. సుందరానికీ !”

Ante Sundaraniki Gets Massive Response on Netflix,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Super Hit Movie In Netflix,Ante Sundaraniki Movie Streaming in Netflix, Ante Sundaraniki Movie in No 1 Position in Netflix,Ante Sundaraniki Movie Stands in No 1 Position in Netflix,Natural Star Nani,Nani Ante Sundaraniki Movie, Natural Star Nani and Nazriya Fahad in Ante Sundaraniki Movie,Nani and Nazriya Fahad latest Movie Ante Sundaraniki,Nazriya Fahad Telugu Movies, Nazriya Fahad,Ante Sundaraniki,Netflix,Ante Sundaraniki Natural Star Nani and Nazriya Fahad Streaming in No 1 Position in Netflix

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈమూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంటే సుందరానికీ !” మూవీ జూలై 10 వ తేదీ నుండి తెలుగు , తమిళ , మలయాళ భాషల వెర్షన్స్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్ రావడం విశేషం. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించిన టాప్ 10 మూవీస్‌లో “అంటే సుందరానికీ !”’ చిత్రం నెం.1 పొజీషన్‌లో నిలిచీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే లిస్ట్ లో ఈ సినిమా తమిళ వెర్షన్ 6వ స్థానంలో నిలిచింది. కరోనా తర్వాత థియేటర్స్‌కు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు.. ఇలాంటి కామెడీ చిత్రాల్ని కుటుంబ సమేతంగా ఓటీటీలోనే చూసి ఆస్వాదించాలనుకుంటున్నారు.ఈ సినిమా ఓటీటీలో అద్భుత స్పందన తెచ్చుకోవడంతో మేకర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =