గాయమైనా ‘ది వారియర్’ చేశా..!

Ram Pothineni opens up about Warrior Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior,The Warrior Movie,The Warrior Telugu Movie,The Warrior latest Updates,The Warrior Upcoming Movie,Hero Ram Pothineni About The Warrior Movie, Ram Pothineni Opens About The Warriorr Telugu Movie,Ram About The Warrior Movie,Ram About His Injure,Ram and krithi Shetty The Warriorr Movie

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా ది వారియర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈసినిమా ఈ శుక్రవారం (జులై 14) థియేటర్లలోకి రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రామ్. దీంతో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఇప్పటికే తను తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తను తమిళ్ ఇండస్ట్రీలో అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి నాకు స్పైనల్ ఇంజ్యూరీ ఉన్నా కానీ ఈసినిమా చేయ్యాలని నేను అనుకున్నాను.. తమిళ్ లో చేయాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నా.. లింగుస్వామి చెప్పిన కథ నాకు ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక నేను చెన్నైలోనే పెరిగాను కాబట్టి తమిళ్ లో డబ్బింగ్ చెప్పడం నాకు పెద్దగా కష్టం ఏం అనిపించలేదు. ఈసినిమాకోసం మాటీమ్ నిజంగానే వారియర్లలాగ పనిచేశారు అంటూ తెలిపాడు.

కాగా యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − one =