
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 64


రాజ్ దూత్ మూవీ మౌత్ టాక్

'భీష్మ'లో 'పరిమళ'గా వెన్నెల కిషోర్
మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది - వెంకటేష్

స్పీడుమీదున్న బన్నీ డబ్బింగ్ షురూ
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్

'మిషన్ మంగళ్'టీజర్ రిలీజ్
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

మన్మథుడు 2 సెకండ్ టీజర్ విడుదల
ఇన్ స్టాగ్రామ్ లో 'ఆల్వేస్ రామ్ చరణ్'
నెటిజన్ కు తాప్సీ ఛాలెంజ్

భారీ స్థాయిలో మూడు భాషల్లో రామాయణ

10 ఏళ్ళ తరువాత `రెచ్చిపో`జోడీ?

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్?

రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?

గాంధీ జయంతికి అమితాబ్ బచ్చన్ డబుల్ ధమాకా?

`గీత గోవిందం` తరువాత మరోసారి...?

దొరసాని మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

రాజ్ దూత్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

'భీష్మ'లో 'పరిమళ'గా వెన్నెల కిషోర్
నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.నిన్న మ్యాచ్ ఓడిపోయిన భాదలో ఉన్నాను.. ఈరోజు హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్ తో మొదటి సారి నటించినందుకు ఆనందంగా ఉన్నాను అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాలో పరిమళ గా వెన్నెల కిషోర్ కనిపించనున్నాడు.
మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది - వెంకటేష్
'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.
గుణ 369 ఫస్ట్ లిరికల్ 'తొలి పరిచయమా ఇది' రిలీజ్
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్పీడుమీదున్న బన్నీ డబ్బింగ్ షురూ
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంగ్స్ మినహాయించి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఒక వైపున షూటింగ్ కొనసాగుతూ ఉండగానే, మరో వైపున బన్నీ డబ్బింగ్ ను కూడా ప్రారంభించాడు. ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున టైమ్ రానే వచ్చేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త లేటవడంతో ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'మిషన్ మంగళ్'టీజర్ రిలీజ్
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా “మిషన్ మంగళ్”. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారు.
డియర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. దానికి తోడు ఇటీవల వచ్చిన టీజర్ కు పాటలకు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మన్మథుడు 2 సెకండ్ టీజర్ విడుదల
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ మన్మథుడు 2 మూవీ ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ అతిథి పాత్రలలో నటించారు. రావు రమేష్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, దేవ దర్శిణి ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఇన్ స్టాగ్రామ్ లో 'ఆల్వేస్ రామ్ చరణ్'
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. కొంత మంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా తమ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరన్న సంగతి కూడా విదితమే. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఆయనకు ఫేస్‌బుక్ ఖాతా ఉంది. ఇటీవలే తన ట్విట్టర్ ను కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేసుకున్నాడు.
నెటిజన్ కు తాప్సీ ఛాలెంజ్
వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ హిందీతో పాటు తెలుగు కూడా తన సత్తా చాటుతుంది తాప్సీ. ఇటీవలే బద్లా సినిమాతో హిందీలో హిట్ కొట్టిన తాప్సీ.. తెలుగులో రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే సినిమాతో మరో హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం తాప్సీ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీ గా ఉంది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఓ నెటిజన్ కు ఛాలెంజ్ విసిరింది తాప్సీ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటారా..? అదేంటంటే..

భారీ స్థాయిలో మూడు భాషల్లో రామాయణ
ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో రామాయణం మీద ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. రామారావు, నాగేశ్వర్రావు కాలంలో అయితే రామాయణం మీద ఎన్నో అద్భుతమైన కావ్యాలు తెరమీద చూపించారు. ఆ తరువాత కమర్షియల్ మూవీస్ కు ఎక్కువగా ప్రేక్షకాదరణ పెరగడంతో ఈ సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. అలాంటి రామాయణం కథ ఆధారంగా మరోసారి అత్యంత భారీస్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నారు.
సాహో మూవీ ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో UV క్రియేషన్స్, T -సిరీస్ బ్యానర్స్ పై రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15 వతేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ సైకో సయాన్ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. సైకో సయాన్ సాంగ్ ను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. అన్ని భాషలలోనూ ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

10 ఏళ్ళ తరువాత `రెచ్చిపో`జోడీ?
యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం... ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ముగ్గురు కథానాయికలకు స్థానమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం... కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కోసం కథానాయిక అన్వేషణలో ఉందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం... ఇప్పుడు ఆ పాత్ర కోసం టాలెంటెడ్ బ్యూటీ ఇలియానాను ఎంపిక చేశారని…

రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాని హీరోయిన్?
ప్రియాంక అరుళ్ మోహన్... ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే... ఈ అమ్మడి తొలి తెలుగు చిత్రం సెట్స్ పై ఉండగానే వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పాలి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ ‘మిస్టర్. K K’
విలక్షణ నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కడారం కొండాన్’. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ‘మిస్టర్. K K’ పేరుతో ఇటీవలే కిల్లర్ లాంటి సూపర్‌హిట్ చిత్రంతో తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్ లు సంయుక్తంగా టి.అంజయ్య సమర్పణ లో విడుదల చేయనున్నారు. కమల్‌తో ‘తూంగావనం’ (తెలుగులో ‘చీకటిరాజ్యం’)వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాజేష్ ఎం.సెల్వ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించాడు. కమల్ రెండో తనయ అక్షర హాసన్ కీలక పాత్ర…

రవితేజ సినిమాలో శ్రీవిష్ణు హీరోయిన్?
‘నేను శైలజ’ చిత్రంలోని “నైట్ ఈజ్ స్టిల్ యంగ్” పాటతో నర్తకిగా వెండితెరకు పరిచయమైన భామ తాన్యా హోప్. అనంతరం ‘అప్పట్లో ఒకడున్నాడు’, ‘పటేల్ సర్’, ‘పేపర్ బాయ్’ వంటి చిత్రాలతో నటిగానూ ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈమె నటించిన కన్నడ చిత్రం ‘హోమ్ మినిస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా... మరో కన్నడ మూవీ ‘ఖాకి’ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీని ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

గాంధీ జయంతికి అమితాబ్ బచ్చన్ డబుల్ ధమాకా?
అమితాబ్ బచ్చన్... భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ పేరే ఒక బ్రాండ్. ఐదు దశాబ్దాల అభినయ పర్వంలో పలు విభిన్న భూమికలను పోషించి... భారతీయ యవనికపై తనదైన ముద్ర వేశారాయన. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా... ఎన్నో విలక్షణ పాత్రల్లో కనిపించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు బిగ్ బి.

`గీత గోవిందం` తరువాత మరోసారి...?
`గీత గోవిందం`... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం. అలాంటి ఈ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నతో... ప్రస్తుతం `డియర్ కామ్రేడ్` చేస్తున్నాడు విజయ్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్... ఈ నెల 26న విడుదల కానుంది. కాగా,`గీత గోవిందం` నాయికతో మరోసారి కలసి పనిచేసిన విజయ్... ఆ చిత్ర దర్శకుడు పరశురామ్‌తోనూ మరో చిత్రం చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఇప్పటికే విజయ్, పరశురామ్ మధ్య చర్చలు జరిగాయని... అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలోగానీ లేదంటే వచ్చే సంవత్సరం…