
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 65


బ్రోచేవారెవరురా పై బన్నీ ప్రశంసలు

ప్రభాస్ ను రికమెండ్ చేసిన యష్..!

బందోబస్త్ మూవీ టీజర్ విడుదల

నిర్మాతగా రానా దగ్గుబాటి

ఆమె ట్రైలర్ రిలీజ్

జంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు

సునయన బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్

రాజమౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు

హ్యాట్రిక్ కొట్టిన ఎస్పీ ప్రొడక్షన్స్
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు

రామ్ జోడీగా నివేదా?

ఓ బేబి మూవీ మౌత్ టాక్
సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

`పింక్` తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ?
`మంగమ్మగారి మనవడు`, `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహా`... ఇలా రీమేక్స్ లోనూ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నటసింహ నందమూరి బాలకృష్ణది. ఇంకా చెప్పాలంటే... ఒరిజినల్ వెర్షన్స్ కంటే మిన్నగా రీమేక్స్ హిట్ అయిన సందర్భాలు బాలయ్యకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో... ఈ నందమూరి హ్యాండ్సమ్ హీరో మరో రీమేక్‌లో నటించబోతున్నారంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

బ్రోచేవారెవరురా పై బన్నీ ప్రశంసలు
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో.. శ్రీ విష్ణు, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్రోచేవారెవరురా ఈనెల 28వ తేదీన రిలీజై మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మరోసారి శ్రీ విష్ణు, నివేదా థామస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటారని ఈ సినిమాతో రుజువైంది.

ప్రభాస్ ను రికమెండ్ చేసిన యష్..!
నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ను ఏంటి యష్ రికమెండ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అసలు స్టోరీ ఏంటంటే.. కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో యష్ కన్నడ తో పాటు తెలుగు, హిందీ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కలెక్షన్ల పరంగా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక యష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. కన్నడ స్టార్ డైరక్టర్ ఒకరు యష్ ని ఓ ఇంట్రస్టింగ్ స్టోరీతో, పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథతో ఎప్రోచ్ అయ్యారట. కేజీఎఫ్ సినిమాను మించిన కథ అవుతుందని యష్ కి ఆ డైరెక్టర్ చెప్పాడట.

బందోబస్త్ మూవీ టీజర్ విడుదల
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై KV ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాప్పాన్ తమిళ మూవీ రూపొందింది . మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,ఆర్య, సాయేషా ముఖ్య పాత్రలలో నటించారు. హీరో సూర్య 37 చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా, సూర్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కాప్పాన్ తమిళ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ బందోబస్త్ .

నిర్మాతగా రానా దగ్గుబాటి
బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రానా దగ్గుబాటి ఆ మూవీ లో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిన రానా ఇప్పుడు ఫుల్ టైమ్ నిర్మాతగా మారారు. యువ నటుడు రాజ్ తరుణ్ హీరో గా సొంత బ్యానర్ లో రానా ఒక మూవీ ని నిర్మిస్తున్నారు.

ఆమె ట్రైలర్ రిలీజ్
రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలా పాల్. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జంధ్యాల ‘జయమ్ము నిశ్చయమ్మురా!’కు 30 ఏళ్ళు
“హాస్యబ్రహ్మ” జంధ్యాల దర్శకత్వంలో పలు జనరంజక వినోదాత్మక చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఒకటి. రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సుమలత, అవంతి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుత్తివేలు, శ్రీలక్ష్మి, రాధాకుమారి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటుడిగా తొలి అడుగులు వేయగా... సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్, సుమన్, రమేష్ బాబు అతిథి పాత్రల్లో తళుక్కున మెరిసారు.

సునయన బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్
చైల్డ్ ఆర్టిస్ట్ కమ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, సీరియల్ యాక్టర్ కమ్ కమ్ కమ్ పెట్టుకుంటూ పోవాలి సునయన గురించి చెప్పాలంటే. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనసు మమత అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సనయన.. తన అభినయంతో అందరినీ మెప్పించింది. చిన్న వయసులో ఎంతో మెచ్యూర్డ్ గా నటించగలిగిన టాలెంట్ ఆమె సొంతం. దీనికి అమ్మోరు సినిమానే ఓ నిదర్శనం. తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల్నింటిలో ఇదో మైల్ స్టోన్ లాంటి సినిమా.
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం స్పెషల్ ట్రైన్ సెట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించే పనిలో ఉంది చిత్ర బృందం. కాగా... మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి ‘ఈగ’కు 7 ఏళ్ళు
ఎస్.ఎస్.రాజమౌళి... తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన అగ్రశ్రేణి దర్శకుడు. తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం:1’ నుంచి గత చిత్రం ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ వరకు ఈ దర్శకధీరుడు తెరకెక్కించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ బాట పట్టడం విశేషం. వాటిలో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ‘ఈగ’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత , కన్నడ నటుడు ‘కిచ్చా’ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆదిత్య, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి, దేవదర్శిని, హంసానందిని తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

హ్యాట్రిక్ కొట్టిన ఎస్పీ ప్రొడక్షన్స్
సురేష్ ప్రొడక్షన్స్... తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థలలో ఒకటి. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు ఎంతో మంది హీరో హీరోయిన్స్ కూడా ఈ సంస్థ ద్వారా పరిచయమయ్యారు. అందుకే మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఈ సంస్థను స్థాపించి దాదాపు 55 ఏళ్ళు కావస్తున్నా కూడా ఏనాడూ వెనుకపడలేదు. రామానాయుడుతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ.. రామానాయుడు అనంతరం...ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు సురేష్ బాబు.. ఇప్పుడైతే అటు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే.. చిన్న సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఎస్పీ…
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.

ఓ బేబి మూవీ రివ్యూ
మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పాస్ అనిపించుకోగా రిచర్డ్ ప్రసాద్ కెమెరా, జునైడ్ ఎడిటింగ్ తదితర టెక్నికల్ అంశాలు బాగున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర నిర్మాణం పట్ల పూర్తి అవగాహన కలిగిన నిర్మాతలు"ఓ..బేబీ" కి ఏం కావాలో అవి సమకూర్చి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ను అందించటంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి అంచనాల అంచులను అందుకున్న" ఓ.. బేబీ" కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ
ఒరునాళ్ కూత్తు తమిళ మూవీ తో కోలీవుడ్ లో ఎంటరయిన తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ నటించిన ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్ తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్... పలు భాషల్లో సినిమాలను నిర్మించినప్పటికీ లేడీ డైరెక్టర్ల కాంబినేషన్స్‌లో తెరకెక్కించిన సినిమాలు తక్కువనే చెప్పాలి. సరిగ్గా ఐదేళ్ళ క్రితం శ్రీప్రియ దర్శకత్వంలో `దృశ్యం`ని (2014) నిర్మించగా... మళ్ళీ ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో `ఓ బేబీ`ని నిర్మించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా పలు కుటుంబకథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘లక్ష్యం’ ఒకటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీవాస్ దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు. జగపతిబాబు, కళ్యాణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ‘ఆహుతి’ ప్రసాద్, యశ్‌పాల్ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించారు.

రామ్ జోడీగా నివేదా?
‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నివేదా పేతురాజ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ‘చిత్రలహరి’తోనూ ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’తో మరోసారి ప్రేక్షకులను అలరించిన ఈ భామ... బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అమ్మడు... బన్నీ హీరోగా నటించనున్న ‘ఐకాన్’లోనూ ఓ నాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ‘చిత్రలహరి’ వంటి సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కిషోర్…

ఓ బేబి మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.
సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు
జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాలు తీసే పద్దతి కూడా మారుకుంటూ వచ్చింది. పాతకాలం సినిమాలను.. ఇప్పటి సినిమాలను పోల్చి చూస్తే ఎంతో తేడా ఉంటుంది. అప్పటి సినిమాల్లో కుటుంబ విలువలు, బంధాలు-బాంధవ్యాలు, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఇలా అనేక అంశాలు ఉండేవి. అప్పట్లో సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నాంబ, సావిత్రి, సూర్యకాంతం, జమున, వాణిశ్రీ ఇలా మహానాయికలతో నటించాలంటే అప్పటి హీరోలు సైతం భయపడే వాళ్లు. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని మరీ సినిమాలు రాసేవాళ్లు.

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రేజీ స్టార్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ కాగా సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ గుణ 369 మూవీ కి సంగీతం సమకూర్చారు.