నెటిజన్ కు తాప్సీ ఛాలెంజ్

2019 Latest Telugu Movie News, Actress Taapsee Pannu Challenges A Netizen, Taapsee busy with her Upcoming projects, Taapsee Latest movie News, Taapsee Pannu shuts down man making comment, Taapsee Pannu Response to Netizen, Actress Taapsee Pannu Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Actress Taapsee Pannu Challenges A Netizen

వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ హిందీతో పాటు తెలుగు కూడా తన సత్తా చాటుతుంది తాప్సీ. ఇటీవలే బద్లా సినిమాతో హిందీలో హిట్ కొట్టిన తాప్సీ.. తెలుగులో రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే సినిమాతో మరో హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం తాప్సీ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హిందీలో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ బిజీ గా ఉంది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఓ నెటిజన్ కు ఛాలెంజ్ విసిరింది తాప్సీ. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటారా..? అదేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తాప్సీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఓ ట్వీట్ చేసింది. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఇక సెలబ్రిటీలను కామెంట్ చేయడానికి నెటిజన్లలో కొంత మంది ఎప్పుడూ వెయిట్ చేస్తుంటారు.. అలానే తాప్సీ పెట్టిన ట్వీట్ పై కూడా ఓ నెటిజన్ స్పందించి కామెంట్ చేశాడు.

‘అనుభవ్‌ సర్‌.. మీరు సినిమాలో తాప్సీకి బదులు మరో నటిని ఎంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సీకి నటనే రాదు’ అని విశాల్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరి తాప్సీ ఊరుకుంటుందా.. నెటిజన్ కు సమాధానమిస్తూ.. ‘సారీ.. ఇప్పుడేం చేయలేవ్‌.. సినిమాకు సంతకం చేసేశాను. ఇప్పుడు అనుభవ్‌ సర్‌ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా నేను అది జరగనివ్వను. ఒక పనిచెయ్‌.. నేను మరో సినిమాకు సంతకం చేసేలోపు ఆ చిత్రంలో నన్ను ఎవ్వరూ తీసుకోకుండా ఆపి చూడు’ అని కౌంటర్ తో పాటు ఛాలెంజ్‌ విసిరింది. దీంతో తాప్సీకి సపోర్టుగా పలువురు నెటిజన్లు నిలిచారు. మరి తాప్సీ ఛాలెంజ్ ను సదరు నెటిజన్ స్వీకరిస్తాడా..?

[subscribe]

[youtube_video videoid=6g3jL1wapdM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 10 =