కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 54

VV Vinayak Movie To Have 1940-80 Backdrop??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,VV Vinayak Upcoming Movie News,VV Vinayak Next Film Updates,VV Vinayak New Movie News,VV Vinayak Latest Movie Detail
సినిమా వార్తలు

1940-1980 బ్యాక్ డ్రాప్ లో వినాయక్ మూవీ..!

ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు హీరో గా కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్‌ దగ్గర పనిచేసిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 9న ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అదేరోజు టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Naga Chaitanya And Shekar Kammula Movie To Release On A Special Day, Naga Chaitanya Movie To Release On A Special Day, Naga Chaitanya New Movie Details, Naga Chaitanya Next Film Updates, Naga Chaitanya Upcoming Movie News,
సినిమా వార్తలు

స్పెష‌ల్ డేన రానున్న‌ చైతు ప్రేమకథ?

యువ సామ్రాట్ నాగ చైతన్య , సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేష‌న్‌లో ఓ డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం... ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

Team TFNవాట్సాప్
Prabhas Unveils Mann Bairagi First Look Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mann Bairagi Movie First Look,Mann Bairagi Movie Latest News,Mann Bairagi Movie Updates,Prabhas Unvealed Mann Bai
ఫస్ట్ లుక్

ప్రభాస్ రిలీజ్ చేసిన "మన్ బైరాగి" ఫస్ట్ లుక్

హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగాసంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో మన్ బైరాగి మూవీ ని మహావీర్ జైన్ తో కలసి నిర్మిస్తున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు మోదీ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Team TFNవాట్సాప్
Hero Varun Tej Follows Mega Power Star Pawan Kalyan, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Varun Tej Follows Pawan Kalyan, Varun Tej Follows Power Star Pawan Kalyan, Varun Tej Latest News, Varun
సినిమా వార్తలు

బాబాయ్ బాటలో అబ్బాయ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. వ‌రుణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్‌ను హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ్ మూవీ ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... కోలీవుడ్ హీరో అధ‌ర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో... “గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్” అలియాస్ “గ‌ని” అనే పేరుతో వరుణ్ తేజ్ సందడి చేయనున్నాడనే విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

Team TFNవాట్సాప్
Vijay Deverakonda New Movie Titled As World Famous Lover,Vijay Deverakonda New Movie Title Revealed,World Famous Lover Movie Updates,World Famous Lover Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywoo
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో.. తాజాగా సినిమా టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 'వరల్డ్ ఫెమస్ లవర్' అనే ఓ డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ విజయ్ గ్యాంగ్ ప్లాన్ చేసుకుంటోంది. మరి విజయ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

బ‌ల్గేరియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు... వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా... కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి తెరరూపం ఇస్తున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో... కొమరం భీమ్‌గా యన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కథానాయికగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్‌లో... బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ‌గ‌ణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే సినిమా కోసం ఇళయరాజా, యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు

ఇళయరాజా... నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న దిగ్గజ స్వరకర్త. అలాంటి మ్యూజిక్ మేస్ట్రో వారసుడిగా స్వరంగేట్రం చేసిన యువన్ శంకర్ రాజా కూడా రెండు దశాబ్దాలకు పైగా తన బాణీలతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాడు. అయితే, ఈ తండ్రీకొడుకులు ఇప్పటివరకు ఒకే సినిమా కోసం బాణీలు కట్టిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శోభన్‌బాబు తొలిచిత్రం ‘దైవబలం’కు 60 ఏళ్ళు

కుటుంబకథా చిత్రాలకు చిరునామాగా నిలిచిన కథానాయకుడు శోభన్‌బాబు. ముఖ్యంగా... అశేష మహిళా అభిమానగణం ఈ అందాల నటుడి సొంతం. అలాంటి... శోభన్‌బాబు వెండితెరపై తొలిగా సందడి చేసిన చిత్రం ‘దైవబలం’. మహానటుడు నందమూరి తారకరామారావు, జయశ్రీ నాయకానాయికలుగా నటించిన ఈ జానపద చిత్రంలో... గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, రమణారెడ్డి, ముక్కామల, వంగర, కస్తూరి శివరావు, గిరిజ, మాలతి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. పొన్నలూరి బ్రదర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి ఓ వైపు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... దర్శకత్వం కూడా వహించారు పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పారిస్ కు 'అలవైకుంఠపురంలో' టీమ్

స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కాకినాడ పరిసర ప్రాంతాలలో.. హైదరాబాద్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం..వచ్చేనెల మొదటివారంలో అలవైకుంఠపురంలో టీం తమ నెక్స్ట్ షెడ్యూల్ కొరకు ప్యారిస్ వెళ్లనున్నారని సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలలో పాటు పాటలను కూడా షూట్ చేయనున్నారట.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda New Movie Title To Be Revealed Tomorrow,Vijay Deverakonda New Movie Title Out Tomorrow,Hero Vijay Deverakonda Upcoming Movie Title Revealing Tomorrow, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cin
సినిమా వార్తలు

విజయ్-క్రాంతి మాధవ్ సినిమా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్ర యూనిట్.. తాజాగా టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేసారు. రేపు ఉదయం 11గంటలకు విజయ్ దేవరకొండ చిత్ర టైటిల్ ప్రకటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Fast And Furious 7 Team For Disco Raja Movie,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Fast & Furious 7 stunt team for Ravi Teja Disco Raja,Disco Raja Movie,Ravi Teja New Movie Disco Raja,Disco Raja Movie Action Composes,Disco
సినిమా వార్తలు

డిస్కో రాజా కోసం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' టీమ్

ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగు పూర్తిచేసుకుంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' కి పనిచేసిన స్టంట్ మాస్టర్లు పనిచేయనున్నారట. అంతే కాదు ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ గా 'వాల్మీకి' ప్రీ రిలీజ్ బిజినెస్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి అన్ని కార్యకమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగా జరిగినట్టే తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Thanneer Mathan Dinangal A Low Budget Wonder,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Thanneer Mathan Dinangal Movie Collections,Low Budget Thanneer Mathan Dinangal Movie,Thanneer Mathan Dinangal Movie 2019
సినిమా వార్తలు

ఆ మళయాళ మాయకు పెట్టింది చిటికెడు దొరికింది దోసెడు

ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడికి లాభనష్టాలకు మధ్య ఒక 20 లేదా 25 శాతం తేడా ఉంటుంది. అంటే లాభం వస్తే రూపాయికి పావలా వస్తుంది.... నష్టం వస్తే రూపాయికి పావలా పోతుంది.ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రమే రూపాయికి వంద రెట్ల లాభం రావటానికి లేదా రూపాయికి రూపాయి నామ రూపాలు లేకుండా పోవటానికి అవకాశం ఉంటుంది. అయితే రూపాయికి రూపాయి పోవటం ఇక్కడ నిత్యం జరిగేదే. కానీ రూపాయికి వందరెట్ల లాభాన్ని చూసే అరుదైన అదృష్టం ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే అలాంటి అదృష్టం ఎవరో ఒకరిద్దరికి దొరికితే దాన్ని చూసి వందల మంది మిణుగురు పురుగుల్లా ఈ గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షితులవుతుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం…

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

రాక్షసుడు, ఎవరు క్లోజింగ్ కలెక్షన్స్

గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన రాక్షసుడు, ఎవరు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఆగష్ట్2 వ తేదీన రిలీజ్ అయిన రాక్షసుడు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు ఎన్నో ఏళ్ళ నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలను కూడా నెరవేర్చింది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

మొత్తానికి ఈ ఏడాది ప్రథమార్థంలో జెర్సీ సినిమాతో మంచి హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని.. ద్వితీయార్థంలో గ్యాంగ్ లీడర్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. నాని కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచి మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం సినిమాలు కూడా ఏమి లేకపోవడం కూడా గ్యాంగ్ లీడర్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. దీనితో మొదటి వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ నే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న గ్యాంగ్ లీడర్ మొదటి వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11.50 కోట్ల…

TFN Adminవాట్సాప్
Sanjjanaa Supports Cauvery Calling Campaign,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Cauvery Calling Campaign,Cauvery Calling,Sanjjanaa Supports Cauvery Calling,Tollywood Celebs Supports Cauvery Calling,Actors Supports Cauvery
సినిమా వార్తలు

కావేరి కాలింగ్ ఉద్యమానికి సంజన సపోర్ట్

గోదావరి, మహానది తరువాత దక్షిణాది లో కావేరి నది 4వ పొడవైన నది. హరాంగి, హేమావతి, లక్ష్మణ తీర్ధ, అమరావతి, భవాని, కబిని , నోయల్ నదులు కావేరి నది కి ఉప నదులు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కావేరి నది పరీవాహక ప్రాంతాలు. కావేరి నది జలాల పరిరక్షణకు, పర్యావరణానికి సద్గురు అండ్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావేరి కాలింగ్ పేరు తో ఉద్యమం ప్రారంభమయింది. కావేరి కాలింగ్ ఉద్యమం అంటే 242 కోట్ల మొక్కలు నాటడం, రైతులకు సపోర్ట్ చేయడం, భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం.

Team TFNవాట్సాప్
Nayanthara New Movie Netrikann First Look Poster Revealed,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Nayanthara New Movie Netrikann,Netrikann First Look Poster,Netrikann First Look,Nayanthara Netrikann First Look,Netrikann Movie
ఫస్ట్ లుక్

'మూడోకన్ను' తెరవనున్న నయనతార

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను సైలెంట్ గా నిన్ననే ప్రారంభించారు చిత్రయూనిట్. నిన్నటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya To Act In A Multi-Starrer,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Naga Chaitanya Multi-Starrer Movie,Naga Chaitanya Next Upcoming Multi-Starrer,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie Details
సినిమా వార్తలు

మల్టీ స్టారర్ మూవీస్ లో నాగ చైతన్య

సూపర్ హిట్ మజిలీ మూవీ తరువాత నాగచైతన్య, KS రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ లో విక్టరీ వెంకటేష్ తో కలసి నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ మామ మూవీ లో నాగ చైతన్య తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక ప్రేమ కథ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Vidya Balan Shakuntala Devi First Look Out Now,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Shakuntala Devi First Look,Shakuntala Devi First Look Poster,Vidya Balan Shakuntala Devi Movie,Shakuntala Devi Movie Latest News,Vidya Bal
ఫస్ట్ లుక్

'శకుంతల దేవి' ఫస్ట్ లుక్ రిలీజ్

మొదటి నుండి విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'మిషన్ మంగళ్' సినిమాతో మంచి హిట్ కొట్టిన విద్యా.. మరో బయోపిక్ తో రానుంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati To Act In A Horror Movie?,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Rana Daggubati Next Horror Movie,Rana Daggubati to Play in Horror Movie,Actor Rana Daggubati New Movies,Horror Telugu Movies 2019,Rana Daggubati
సినిమా వార్తలు

హారర్ మూవీ లో రానా దగ్గుబాటి

ఆసక్తికర క్యారెక్టర్స్, విభిన్న కథాంశ చిత్రాలను ఎంపిక చేసుకొనే రానా దగ్గుబాటి ఒక హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు తెలుగు, హిందీ మూవీస్ లో నటిస్తున్న రానా ప్రస్తుతం USA లో ఉన్నారు. ఈ నెలాఖరుకు హైదరాబాద్ చేరుకొని వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. కంటిన్యూ షెడ్యూల్స్ తో విరాటపర్వం మూవీ షూటింగ్ పార్ట్ రానా కంప్లీట్ చేస్తారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్