ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడికి లాభనష్టాలకు మధ్య ఒక 20 లేదా 25 శాతం తేడా ఉంటుంది. అంటే లాభం వస్తే రూపాయికి పావలా వస్తుంది…. నష్టం వస్తే రూపాయికి పావలా పోతుంది.ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రమే రూపాయికి వంద రెట్ల లాభం రావటానికి లేదా రూపాయికి రూపాయి నామ రూపాలు లేకుండా పోవటానికి అవకాశం ఉంటుంది. అయితే రూపాయికి రూపాయి పోవటం ఇక్కడ నిత్యం జరిగేదే. కానీ రూపాయికి వందరెట్ల లాభాన్ని చూసే అరుదైన అదృష్టం ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే అలాంటి అదృష్టం ఎవరో ఒకరిద్దరికి దొరికితే దాన్ని చూసి వందల మంది మిణుగురు పురుగుల్లా ఈ గ్లామర్ ప్రపంచం వైపు ఆకర్షితులవుతుంటారు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ట్రేడ్ లో అందరినీ ఆకర్షిస్తున్న అలాంటి ఒక అద్భుత విజయం మలయాళంలో వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం రెండు కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఒక మలయాళీ లో-బడ్జెట్ చిత్రం ఏకంగా 50 కోట్లు కొల్లగొట్టి అన్ని భారతీయ భాషా చిత్రాల దర్శక నిర్మాతలను ఊరిస్తుంది. “తన్నీర్ మాథన్ దినంగళ్ ” అనే టైటిల్ తో రూపొందిన ఒక మలయాళ లో- బడ్జెట్ సినిమా 2019 జులైలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా మలయాళంలో అనేక పాత రికార్డులను చెరిపేసింది…. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
గిరీష్ ఏ.డి. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమకే ఒక తలమానిక విజయంగా నిలిచి యావత్ భారత చిత్ర పరిశ్రమను ఆకర్షిస్తుంది. వినీత్, శ్రీనివాసన్, మ్యాథ్యూ తామస్, అనాశ్వర్య రాజన్ తదితరులు నటించిన ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం అన్ని భాషల దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. 2016 లో నిర్మితమైన మరాఠీ లో-బడ్జెట్ చిత్రం ‘సైరత్’ కూడా ఇలాగే సంచలన విజయాన్ని సాధించి చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. ఇలా సక్సెస్, హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అనే పదాలకు నిజమైన నిర్వచనంగా నిలవాలి అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కొల్లగొట్టాలి. అంతేకానీ కోటానుకోట్లు వెండితెర మీద వెదజల్లి బొటాబొటీ కవరేజ్ తో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఉండకూడదు విజయమన్నది.
Hats off to the entire team of “Thanneer Mathan Dinangal”.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: