స్పెష‌ల్ డేన రానున్న‌ చైతు ప్రేమకథ?

Latest Telugu Movies News, Naga Chaitanya And Shekar Kammula Movie To Release On A Special Day, Naga Chaitanya Movie To Release On A Special Day, Naga Chaitanya New Movie Details, Naga Chaitanya Next Film Updates, Naga Chaitanya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

యువ సామ్రాట్ నాగ చైతన్య , సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేష‌న్‌లో ఓ డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం… ప్రస్తుతం హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… డిసెంబ‌ర్ క‌ల్లా షూటింగ్ పూర్తి చేసి… 2020 ఫిబ్రవరిలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఈ సినిమా విడుదలకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన తేదీ వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… ప్రేమకథగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌ట‌. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

కాగా… ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను… నారాయణ్ దాస్ కె.నారంగ్, రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =